
కరోనా వైరస్.. సుమారు ఐదేళ్ల క్రితం ఈ మహమ్మారి వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. మరెంతో మందిని రోడ్డు పాలు చేసింది. అయితే ఈ కష్టకాలంలో డాక్టర్లు అందించిన సేవలు చిరస్మరణీయం. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మందికి ప్రాణం పోశారు వైద్యులు. ఇలా కోవిడ్ కష్ట కాలంలో వారియర్లుగా పని చేసిన వారిలో ప్రముఖ సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఓ అందాల తార కూడా ఉంది. పై ఫొటో ఆమెదే. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ హీరోయిన్ చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలనుకుంది. క్యాన్సర్ తో బాధపడుతోన్న తన తల్లిని చూసి అంకాలజిస్ట్ అవ్వాలని కలలు కంది. అందుకు తగ్గట్టుగానే ఉన్నత చదువులు అభ్యసించింది.
గుంటూరు కాటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా సేవలు కూడా అందించింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. అయితేనేం తన అందం, అభినయంతో చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.
చిన్నప్పటి నుంచే చదువుపై నృత్యంపై ఆసక్తి పెంచుకుందీ అందాల తార. కూచిపుడి, భరత నాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పలు నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెల్చుకుంది. ఏడేళ్ల వయసులోనే సంగీత దిగ్గజం మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే పలు కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. ఇక ఏటా హైదరాబాద్ లో జరిగే కార్తీక దీపోత్సవంలోనూ పాల్గొంది. అందులో శివుడి వేషధారణలో కనిపించి ఆహూతులను అలరించింది. తన డ్యాన్స్ వీడియోలు అప్పట్లో నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక షార్ట్ ఫిల్మ్స్ తో సినిమా కెరీర్ ఆరంభించిన ఈ అందాల తార హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. చేసింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు రూపా కొడువాయూర్.
రూపా కొడువాయూర్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
2020లో రిలీజైన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రూపా కొడువాయూర్. 2023లో బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ ఖాన్ తో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ మధ్యన ప్రియదర్శి సరసన సారంగపాణి జాతకం సినిమాలో నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.