ముంబైలోని ఓ హిందూ ఫ్యామిలీలో ఈమె పుట్టింది. డిగ్రీ పూర్తికాకుండానే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొదట కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని యాడ్స్ లో యాక్ట్ చేసింది. ఆపై ఒక తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అది సూపర్‌హిట్ కావడంతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసి ఆడియెన్స్ ను అలరించింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ హీరోయిన్ పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. అదేంటంటే.. చాలామంది హీరోయినలకు సాధ్యం కాని విధంగా ఏకంగా తొమ్మిది భాషల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఓవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తుండగానే పెళ్లిపీటలెక్కింద అందాల తార. ఒక ప్రముఖ నటుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ అందాల తార ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులకు మళ్లీ సినిమాల్లోకి వచ్చినా ఎక్కువగా అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. దీంతో నటనకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటోందీ అందాల తార.
ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తోన్న ఈ అందాల తార మరెవరో కాదు.. పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ ప్రీతి జింగానియా. నరసింహ నాయుడులో బాలకృష్ణతో, అధిపతి మూవీలో మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. అలాగే అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే సినిమాల్లోనూ తళుక్కుమంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. దీని తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు ప్రీతి.
ప్రీతి జింగానియా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
2008లో నటుడు పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు బిజినెస్ వుమన్ గా బిజి బిజీగా ఉంటోంది. భర్తతో కలిసి ‘స్వెన్ ఎంటర్టైన్మెంట్’ అనే కంపెనీని రన్ చేస్తోంది ప్రీతి. అలాగే ప్రో పంజా లీగ్’ అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కో-ఫౌండర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.