Tollywood : ఒకప్పుడు అమీన్‌పూర్‌ కోకాకోలా కంపెనీలో నార్మల్ ఉద్యోగి.. కట్ చేస్తే.. రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్..

Tollywood : ఒకప్పుడు అమీన్‌పూర్‌ కోకాకోలా కంపెనీలో నార్మల్ ఉద్యోగి.. కట్ చేస్తే.. రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్..


Tollywood : ఒకప్పుడు అమీన్‌పూర్‌ కోకాకోలా కంపెనీలో నార్మల్ ఉద్యోగి.. కట్ చేస్తే.. రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్..

కమెడియన్ మహేష్ అచంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుత తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. తన ప్రయాణం కోకాకోలా కంపెనీలో సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైందని. నెలకు ఆరు వేల రూపాయల జీతంతో మియాపూర్ సమీపంలోని అమీన్‌పూర్‌లో కొకొకల కంపెనీలో పనిచేసేవాడినని గుర్తుచేసుకున్నారు.. రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు షిఫ్ట్ చేస్తూ, పగటిపూట అవకాశాల కోసం అమీర్‌పేట, కృష్ణానగర్, హైటెక్ సిటీ, ఫిలింనగర్ వంటి ప్రాంతాల్లో నడుచుకుంటూ తిరిగేవాడినని అన్నారు.. నిజాంపేటలోని స్నేహితుడి సోదరుడి ఇంట్లో భోజనం చేసి, మళ్ళీ రాత్రిపూట ఉద్యోగానికి వెళ్లేవారు. ఒకసారి నిద్రలేమి కారణంగా 250 కేస్‌ల కొకొకల లోడ్‌ను తప్పుగా పంపడంతో మేనేజర్ “సినిమాలైనా చేయి, ఉద్యోగమైనా చేయి, రెండూ నీకు సెట్ అవ్వవు” అని చెప్పి ఉద్యోగం నుండి తొలగించారట.

ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో 2012లో తన తండ్రి మరణించారని. తండ్రి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దుస్థితి ఎదురైందని ఎమోషనల్ అయ్యారు.. చిన్ననాన్నలు, తల్లిదండ్రుల చెల్లెళ్ల భర్తలు కలిసి సుమారు 50,000 రూపాయలు సమకూర్చి అంత్యక్రియలు పూర్తిచేశారని.. ఈ సమయంలో కొంతమంది బంధువులు ఉద్యోగం చేసుకోవాలని సూచించారని అన్నారు. కానీ తన తల్లి మాత్రం ఎప్పుడూ తనను నిరుత్సాహపరచలేదని. ఒకసారి హైదరాబాద్ నుండి సొంత ఊరికి వెళ్లడానికి 101 రూపాయల ట్రైన్ టికెట్ కోసం డబ్బులు అడగాలనిపించక, తల్లి దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె తన నెల జీతం నుండి వెయ్యి రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందని అన్నారు.

జబర్దస్త్ అవకాశం కమెడియన్ సత్య, రైటర్ ప్రసన్న కుమార్ ద్వారా లభించిందని .. వారు తనను శకలక శంకర్‌కు పరిచయం చేశారు. జబర్దస్త్‌లో తన మొదటి స్కిట్‌లోనే రోజా గారి ప్రశంసలు వచ్చాయని అన్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో పది రోజుల పనికి 30,000 నుండి 50,000 రూపాయలు నాగబాబు ఇప్పించారని.. అప్పట్లో ఆ డబ్బును తన కుటుంబ అవసరాలకు, ఇంటికి పంపించడానికి ఉపయోగించినట్లు చెప్పారు..

రంగస్థలం సినిమా అవకాశం కోసం మహేష్ అచంట అనేక సంవత్సరాలు కష్టపడ్డారు. కొకొకల ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయం ఐదు, ఆరు గంటలకే సత్యసాయి నగర్‌లోని సుకుమార్ ఇంటి ఎదురుగా ఉన్న సిమెంట్ దిమ్మెపై కూర్చునేవారు. ప్రసాదం, పది రూపాయల భోజనం, ఐదు రూపాయల కూరతో ఆకలిని తీర్చుకుంటూ అవకాశాల కోసం నిరీక్షించారు. “అమ్మ నాన్నలకి సాయం చేయడం అనేది మొక్క మొదట్లో నీళ్లు పోసినట్టు” అనే సిద్ధాంతాన్ని నమ్మిన మహేష్, తనకు వచ్చిన ప్రతి చిన్న మొత్తాన్ని తన తల్లికి పంపేవారు. ఈ పట్టుదల, సుకుమార్ గారి దయతో రంగస్థలం సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ విజయం తర్వాత తన స్వగ్రామంలో నాలుగు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించుకొని తన తల్లికి అంకితం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

 

View this post on Instagram

 

A post shared by Mahesh Achanta (@mahesh_achanta)

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *