సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఒక్కడు చిత్రం ఒక టెర్రిఫిక్ మాస్ హిట్‌గా, మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే మహేష్ బాబుకు టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయి లభించింది. 2003 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం, అప్పటివరకు చాక్లెట్ బాయ్‌గా మాత్రమే కనిపించిన మహేష్ బాబును, మాస్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే నటుడిగా పరిచయం చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించి, కొత్త రికార్డులను నెలకొల్పింది. ఒక్కడు సృష్టించిన సంచలనం తదనంతరం విడుదలైన అనేక చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపింది.
2003 సంక్రాంతి సీజన్ సినీ ప్రియులకు ఒక రసవత్తరమైన పోటీని అందించింది. ఒక్కడు చిత్రానికి పోటీగా వచ్చిన సినిమాలలో రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఒకటి. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాగా, సరిగ్గా ఒక రోజు తర్వాత, జనవరి 15న మహేష్ బాబు ఒక్కడు విడుదలైంది. ఒక్కడు సినిమా జోరుతో రవితేజ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో రవితేజ సరసన సంగీత హీరోయిన్‌గా నటించారు.
మరోవైపు, ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు తనయుడు వల్లభ హీరోగా నటించిన చిత్రం ఎవరే అతగాడు. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌గా నటించారు. ఒక్కడు చిత్రానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, ఒక్కడు ప్రభంజనం ముందు నిలబడలేకపోయింది. అదేవిధంగా, ఏ.ఎం. రత్నం నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా కూడా ఈ పోటీలో నిలదొక్కుకోలేకపోయింది. ఈ సినిమా జనవరి 9న విడుదలై ఐదు రోజుల తర్వాత, జనవరి 15న ఒక్కడు రిలీజ్ అయింది. దీంతో, బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ చిత్రం కూడా ఒక్కడు ప్రభంజనంలో కనిపించకుండా పోయింది.
అయితే, ఈ ఒక్కడు తుఫానును తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క సినిమా పెళ్ళాం ఊరెళితే. ఒక్కడు మూవీ విడుదలైన రోజే ఈ చిత్రం కూడా విడుదలైంది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫన్ ఎంటర్టైనర్‌లో శ్రీకాంత్, వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీత, రక్షిత హీరోయిన్‌లుగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది.
ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు