సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ లుక్, ఫిట్నెస్, యాక్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం తమ ప్రతిభతో వరుస అవకాశాలు అందుకుంటూ దశాబ్దాల తరబడి స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతుంటారు. అంతేకాదు హీరోయిన్లు సైతం హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నయనతార, త్రిష, అనుష్క, ఇలియానా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ చాలా కాలం పాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో వరుస హిట్స్ అందుకున్నారు. అయితే ఈ హీరోయిన్స్ అందరితో కలిసిన నటించిన టాలీవుడ్ స్టార్ ఎవరో మీకు తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
సినిమాల విషయానికి వస్తే.. . రవితేజ తన స్క్రీన్ స్పేస్‌ను అందరు ప్రముఖ హీరోయిన్లతో పంచుకున్నారు. అనుష్క శెట్టితో కలిసి విక్రమార్కుడు చిత్రంలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బ్సటర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బలాధూర్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక నయనతారతో కలిసి దుబాయ్ శీను, ఆంజనేయులు సినిమాలలో నటించాడు. అలాగే త్రిషతో కలిసి కృష్ణ సినిమాలో నటించాడు. ఈ సినిమా హిట్ అయింది. కాజల్ అగర్వాల్ తో కలిసి సారొచ్చారు, వీర చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు, క్రాక్ చిత్రాలలో శ్రుతి హాసన్ తో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి. తర్వాత రాశిఖన్నాతో టచ్ చేసి చూడు, బెంగాల్ టైగర్ చిత్రాల్లో నటించగా.. టచ్ చేసి చూడు మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. రవితేజ గత రెండు దశాబ్దాలుగా సినీరంగంలో కొనసాగుతున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..