పై ఫొటోను గమనించారా? అందులో ఒక టాలీవుడ్ తోపు డైరెక్టర్ ఉన్నాడు. డైరెక్టర్ అంటే అలాంటి ఇలాంటి డైరెక్టర్ కాదు.. ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్. ఇంకా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే.. తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేశాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న క్రైమ్, హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలను 90వ దశకంలోనే తెరకెక్కించాడు. తన మేకింగ్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. తన ప్రతిభకు ప్రతీకగా మూడు నంది అవార్డులు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో సత్తా చాటుతోన్న ఎంతో మంది పాన్ ఇండియా డైరెక్టర్ల కు ఆయన రోల్ మోడల్. కానీ ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఫేడవుట్ అయిపోయాడు. తన స్థాయికి తగ్గట్టుగా సినిమాలు తీయలేకపోతున్నాడు. ఒకవేళ తీసినా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాడు. పైగా బూతు డైరెక్టర్ అంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమాల కంటే ఇతర విషయాలతో వార్తల్లో నిలుస్తోన్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ.
ఈ మధ్యన సినిమాలు తీయకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. తరచూ ఏదో ఒక విషయంపై ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అలా వర్మ తాజాగా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన చిన్నప్పుడు స్నేహితులతో కలిసి దిగిన ఫొటో ఇది. దీనిని షేర్ చేస్తూ ‘ ఇందులో నేనెక్కడున్నానో కనుక్కోండి చూద్దాం’ అని నెటిజన్లకు సవాల్ విసిరాడు ఆర్జీవీ. దీంతో నెటిజన్లు ఇందులో వర్మ ఎవరై ఉంటారు అని జుట్టుపీక్కుంటున్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అందరూ ఒకే రకమైన హెయిర్ స్టైల్ తో ఉన్నారు. కొందరు అయితే రామ్ గోపాల్ వర్మ ప్రొఫైల్ ఫోటో చూపించి ఇతనే ఆర్జీవీ అంటూ చమత్కారంగా మాట్లాడుతున్నారు. అయితే ఫొటోలో ఎడమ వైపు నుంచి మూడో వరుసలో ఉన్న వ్యక్తే ఆర్జీవీ అని గుర్తు పట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట మీరు వైరల్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
Spot me 😎 pic.twitter.com/eZJZ7B06gY
— Ram Gopal Varma (@RGVzoomin) September 23, 2025
ఇదిగో ఇక్కడున్నాడు రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..