Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  


పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? అతనొక టాలీవుడ్ స్టార్ కమెడియన్. తెలుగు తెరపై తన హాస్యంతో గిలిగింతలు పెట్టిన నటుడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నాడు. తెలంగాణలో పుట్టి పెరిగిన అతను మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టాడు. యాంకర్ గా సత్తా చాటాడు. ఆపై వెండితెరపైనా అదృష్టం పరీక్షించుకున్నాడు. స్టార్ కమెడియన్ గా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. 23 ఏళ్ల కెరీర్ లో సుమారు 500కు పైగా సినిమాల్లో నటించాడు. తన హాస్య చతురతతో టాలీవుడ్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ నటుడి ముఖంపై చిరునవ్వులను చూసి కాలానికి కన్నుకుట్టిందేమో! కెరీర్ పీక్స్ లో ఉండగానే అనారోగ్యం బారిన పడ్డాడు. క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరిస్థితి విషమించి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కానీ అతను నటించిన సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోయాడు. అతను మరెవరో కాదు దివంగత నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్.

గురువారం (సెప్టెంబర్ 25) ఈ టాలీవుడ్ స్టార్ కమెడియన్ వర్ధంతి. ఈ సందర్భంగా సినీ అభిమానులు వేణు మాధవ్ ను మళ్లీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ వేణు మాధవ్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే. 500కు పైగా సినిమాల్లో నటించిన వేణు మాధవ్ 2019లో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. చనిపోడానికి నాలుగేళ్ల నుంచి ముందే అతను సినిమాలకు దూరంగా వున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధ పడ్డాడు వేణు మాధవ్. చాలా ఏళ్ల పాటు చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరికీ ఆరేళ్ల క్రితం ఇదే రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

Venu Madhav Death Death Ann

Venu Madhav Death Death Anniversary

2007లో లక్ష్మి సినిమాలో నటనకు గానూ బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నాడు వేణు మాధవ్. అలాగే దిల్, సై సినిమాలకు గానూ సిని ‘మా’ పురస్కారాలు సొంత చేసుకున్నాడు. ఇక వేణు మాధవ్ భార్య శ్రీవాణి కాగా, కొడుకులు ప్రభాకర్‌, సవీకర్‌ ఉన్నారు.ప్రస్తుతం వీరిద్దరూ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. మరి తండ్రి లాగానే వీరు కూడా సినిమాల్లోకి వస్తారో? లేదో? వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *