Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..


తెలుగు సినీ ప్రపంచంలో మనసుకు తాకే పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆశాపాశం ఒకటి. కేరాఫ్ కంచెరపాలెం సినిమాలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇంతకీ ఈ పాట ఎవరు రాసారో తెలుసా.. ? ఆయన పేరు విశ్వ వేమూరి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గీత రచయిత విశ్వ వేమూరి, తన సుదీర్ఘ గీత రచన ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటగా తాను ఇంగ్లీష్ పాప్ పాటలకు ఎంతగానో ప్రభావితం అయ్యాయని, మైఖేల్ జాక్సన్, విట్నీ హ్యూస్టన్ వంటి దిగ్గజాల స్ఫూర్తితోనే తన రచనా ప్రస్థానం మొదలైందని తెలిపారు. ప్రారంభంలో ఇంగ్లీష్ లిరిక్స్ ఎక్కువగా రాసేవాడినని, ప్రభుదేవా నటించిన సంతోషం సినిమాలో ఒక పాట, అల్లు అర్జున్ ఆర్య చిత్రంలోని యు రాక్ మై వరల్డ్, అలాగే లారెన్స్ డాన్స్ నంబర్స్‌కు సత్యం సినిమాలో ఇంగ్లీష్ పాటలు రాశానని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

అయితే, తన కెరీర్‌లో అతడు చిత్రం కీలక మలుపు తిప్పిందని గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలో ఇంగ్లీష్ లైన్స్ ఉన్నప్పటికీ, తాను రాసిన తెలుగు లైన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో తెలుగు కవిగా తనకంటూ ఒక గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ గుర్తింపు తనకు మరిన్ని తెలుగు అవకాశాలు తెచ్చిపెట్టిందని చెప్పారు. తెలుగు భాషపై తనకున్న మక్కువతో మరింత అధ్యయనం చేసి చక్కటి సాహిత్యం అందించడం మొదలుపెట్టానని అన్నారు. ఆశాపాశం పాట తనకు అత్యంత ప్రత్యేకమని, ఈ పాట తర్వాత మంచి పేరు వచ్చిందని విశ్వ వేమూరి వెల్లడించారు. ఇటీవల వచ్చిన OG చిత్రంలోని ఫైర్ స్టార్మ్, గన్స్ అండ్ రోసెస్ పాటలు కూడా చక్కటి పద ప్రయోగాలతో మంచి ఫీడ్‌బ్యాక్‌ను, అప్రిషియేషన్‌ను పొందాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గన్స్ అండ్ రోసెస్ పాటలోని “అలలిక కదలక భయపడలే, క్షణ క్షణమొక తల తెగి పడలే. యముడికి ఎదురుగ నిలబడలే, మేటి ధాటికి లోకం అడలే. రక్కసి దారుల రుధిరం పొరలే” వంటి లిరిక్స్ గురించి అద్భుతంగా చెప్పుకొచ్చారు. అతడు తన కెరీర్‌కు మంచి పేరు తీసుకొచ్చిందని, అలాగే డోలే డోలే, చెమకా చెమకా, ఇద్దరమ్మాయిలతో చిత్రంలోని వయోలెన్స్, సూపర్ చిత్రంలోని గిచ్చి గిచ్చి, ఏక్ నిరంజన్ వంటి రొమాంటిక్ పాటలు కూడా తనకు మంచి గుర్తింపు తెచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

తన హృదయానికి దగ్గరైన పాటలు ఆశాపాశం, నింగి చుట్టే, 101 జిల్లాల అందగాడు చిత్రంలోని అలసిన సంచారిలను ఆయన పేర్కొన్నారు. ఈ పాటల్లో సాహిత్యపరంగా మంచి భావాలను ఆవిష్కరించే అవకాశం లభించిందని తెలిపారు. అతడు చిత్రంలోని “పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే” అనే పాట తన కెరీర్ మలుపు తిప్పిందని అన్నారు.. ఈ పాటలోని గాఢమైన సాహిత్యం, హీరోను ఎలివేట్ చేసే పద ప్రయోగాలు తన కెరీర్ తొలి నాళ్లలో ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనే ఉత్సాహం నుండి వచ్చినవని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

Lyricist Viswa Vemuri

Lyricist Viswa Vemuri

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *