Tollywood : ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా ఎందుకు సినిమాలను వదిలేసిందో తెలియదు.. నటి ఊర్వశి కామెంట్స్..

Tollywood : ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా ఎందుకు సినిమాలను వదిలేసిందో తెలియదు.. నటి ఊర్వశి కామెంట్స్..


Tollywood : ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా ఎందుకు సినిమాలను వదిలేసిందో తెలియదు.. నటి ఊర్వశి కామెంట్స్..

సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వస్తున్న సమయంలోనే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత కథానాయికగానూ రాణించింది. ఆమె కేవలం 19 ఏళ్ల వయసులోనే ఓ హీరోను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఆ హీరోయిన్ గురించి సీనియర్ నటి ఊర్వశి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె గొప్ప కథానాయిక అని.. కానీ ఇలా అర్థంతరంగా సినిమాలను ఎందుకు వదిలేసిందో అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

ఆ హీరోయిన్ మరెవరో కాదు..నజ్రియా నజీమ్. నేరం సినిమాతో కథానాయికగా మారింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన రాజా రాణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. 2014లో మలయాళంలో నాలుగు సినిమాలు చేసింది. అదే ఏడాది మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 12 సంవత్సరాల సినీ ప్రయాణంలో మలయాళంలో కేవలం నాలుగు సినిమాలు చేసింది. ఇక తెలుగులో నాని జోడిగా అంటే సుందరానికి చిత్రంలో కనిపించింది. ఇప్పుడు ఆమె ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

తాజాగా సీనియర్ నటి ఊర్వశి మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన నటుడు ఫహద్ ఫాజిల్. అతడు హీరోయిజం సినిమాలు చేయడు. కథను నమ్ముకుని సినిమాలు చేస్తుంటాడు. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తాడు. అలాగే బసిల్ జోసెఫ్ సైతం గొప్ప నటుడే. హీరోయిన్స్ విషయానికి వస్తే..మీరా జాస్మిన్, నవ్వ నాయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. కానీ నజ్రియా సినిమాల్లో ఉంటే మరొ గొప్ప నటిగా ఉండేది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది. ఆమెకు మంచి టాలెంట్ ఉంది. కానీ ఇలా సినిమాలను ఎందుకు వదిలేసిందో కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని చెప్పుకోచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

 

View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *