
ప్రస్తుతం హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నటీమణులు అందరూ కూడా ఒకప్పుడు కెరీర్ ఆరంభంలో వివిధ ఉద్యోగాలు చేసేవారు. ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. గుజరాత్‌కు చెందిన ఈ చిన్నది.. తన డిగ్రీని డిజైనింగ్‌లో పూర్తి చేసింది. కామర్స్ స్టూడెంట్ అయిన ఈమె.. చదువుకున్న రోజుల నుంచి నటనపై ఆసక్తిని చూపించింది. డ్యాన్స్‌లో మెలుకువలు నేర్చుకుని.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆపై సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టి.. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే తెలుగు, గుజరాతీ బాషలలో పలు చిత్రాల్లో నటించి మంచి ఫేం సంపాదించింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
ఆమె మరెవరో కాదు ప్రాచి థాకేర్.. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ మూవీతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె మూగ, చెవిటి అమ్మాయి కావ్య పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ఆమె పాత్ర నిడివి ఉండేది కాసేపే అయినప్పటికీ.. తన నటనతో అదరగొట్టింది. ఈ సినిమా మాత్రమే కాదు.. లవ్ యూ టూ, రాడో, అజయ్ గాడు, రాజుగారి కోడిపులావు, పెర్ఫ్యూమ్ వంటి చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇటీవల ‘బకాసుర రెస్టారెంట్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అటు ఈ అందాలభామ కెప్టెన్ బహదూర్, బ్యాడ్ ట్రిప్, తారి మారి ములకాతో, లవ్ సెక్స్ అండ్ డెత్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తరచూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ ఓసారి లుక్కేయండి.
View this post on Instagram