ఒకప్పుడు సినిమాల్లో అగ్ర హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తు్న్నారు. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా చక్రం తిప్పి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అదే హీరోకు తల్లిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. హీరోయిన్ రమ్యకృష్ణ. 2004లో వచ్చిన తెలుగు చిత్రం ‘నాని’లో మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి

అప్పట్లో క్రేజీ హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం..

8 సంవత్సరాలుగా బాక్సాఫీస్‌ను శాసిస్తుంది.. ఇప్పటికీ ట్రెండింగ్ ..

తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్..
ఇక ఈ సినిమా వచ్చిన 20 ఏళ్లకు ఆమె మహేష్ బాబు తల్లిగా కనిపించింది. 2024లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరోకు తల్లిగా కనిపించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో 4 దశాబ్దాలకు పైగా 200 కి పైగా చిత్రాలలో నటించిన రమ్య కృష్ణన్, హీరోయిన్, విలన్ ఎన్నో పాత్రలు పోషించింది. 1999 లో కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహా సినిమాలో విలన్ పాత్రలో నటించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అల్లరి మొగుడు, హలో బ్రదర్, నరసింహనాయుడు వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..