Tollywood: అక్క కంటే ముందే శుభవార్త చెప్పిన హీరోయిన్ చెల్లి.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

Tollywood: అక్క కంటే ముందే శుభవార్త చెప్పిన హీరోయిన్ చెల్లి.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్


టాలీవుడ్‌ లవ్లీ కపుల్ వరుణ్‌ సందేశ్‌- వితికా షెరు ఇటీవలే కొత్తింట్లోకి అడుగు పెట్టారు. గృహప్రవేశం వేడుక కూడా అట్టహాసంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇంతలోనే మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది వితికా షేరు. తన చెల్లెలు కృతిక త్వరలోనే అమ్మకానుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో బేబీ బంప్‌తో ఉన్న కృతిక తన భర్తతో కలిసి ఫొటోలకు పోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు వితికతో పాటు కృతిక-కృష్ణలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కృతిక – కృష్ణల వివాహం 2022లో జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా దగ్గరుండి జరిపించింది వితిక. ఇప్పుడు కృతిక తల్లి కాబోతుండడంతో వితిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక వితిక విషయానకి వస్తే.. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయ నటిగానూ యాక్ట్ చేసింది. ఇదే సమయంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు వరుణ్- వితిక. ఈ సినిమా షూటింగులోనే వీరి పరిచయం మొదలైంది. ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. ఆ తర్వాత 2016 ఆగస్టు 19న పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.

ఇవి కూడా చదవండి

బేబీ బంప్ తో వితికా షేరు చెల్లెలు కృతిక..

పెళ్లి తర్వాత బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు వరుణ్- వితిక. పెళ్లి తర్వాత వితిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రం కనిపిస్తుంటుంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది వితిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. మరోవైపు వరుణ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడీ క్రేజీ హీరో. ఇందులో ధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

గృహ ప్రవేశ వేడుకలో వరుణ్ సందేశ్ ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *