Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే

Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే


ఏడుకొండల స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాంకేతికతను జోడించి టీటీడీ ప్రవేశపెట్టిన మార్పులతో భక్తుల రవాణా వ్యవస్థ మరింత సులభతరమైంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో తిరుమలలోని 20 ప్రధాన బస్టాప్‌లలో డిజిటల్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని నిమిషాల్లో స్టాప్‌కు చేరుకుంటుంది? అనే సమాచారం భక్తులకు ముందే తెలుస్తుంది. దీనివల్ల ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడటం తగ్గి, రోజుకు సుమారు 60 వేల మంది ఈ ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు సగటున 300 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వాడకం తగ్గడంతో తిరుమల కొండపై కాలుష్యం కూడా తగ్గుతోంది. రాత్రి వేళల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 60 ట్రిప్పులకు అదనంగా మరో 20 ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు.హైదరాబాద్‌కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్-ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ వ్యవస్థ, దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తులకు ‘లైవ్ బస్ ఇన్ఫర్మేషన్’ అందిస్తున్న తొలి సాంకేతిక ప్రయోగంగా నిలిచింది. పది నిమిషాల వ్యవధిలోనే బస్సు అందుబాటులో ఉండటంతో సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు

టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి

8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే

Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్

Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *