Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ నెలలోనే కొత్త సేవలు.. ఇక నుంచి నేరుగా..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ నెలలోనే కొత్త సేవలు.. ఇక నుంచి నేరుగా..


తిరుమలకు తరచూ లక్షలాది మంది శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా తిరుపతికి చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులు, క్యాబ్‌ల ద్వారా తిరుమల కొండపైకి వస్తారు. ఇక రైళ్ల విషయానికొస్తే.. తిరుపతికి రైల్వేశాఖ అనేక ట్రైన్ సర్వీసులను నడుపుతోంది. దీంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లు ఎప్పుడూ ప్రయాణికుల రద్దీతో నిండిపోయి ఉంటాయి. కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఇక ప్రయాణికుల తాకిడి కారణంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్టేషన్ నుంచి బయటకు రావాలన్నా లేదా లోపలకు పోవాలన్నా రద్దీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించే పనులు రైల్వేశాఖ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఇవి పూర్తైతే రైల్వే స్టేషన్ రూపురేఖలే పూర్తిగా మారనున్నాయి.

కొత్తగా ఐదు ఫ్లాట్‌ఫామ్స్

ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ 182 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం ఆరు ఫ్లాట్‌ఫామ్స్, ఐదు ఫిట్‌లైన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు ఇవి సరిపోవడం లేదు. దీంతో అదనంగా ఐదు ఫ్లాట్‌ఫామ్స్‌ను రైల్వేశాఖ కొత్తగా నిర్మిస్తోంది. దీంతో ఫ్లాట్‌ఫామ్‌ల సంఖ్య 11కి పెరగనుంది. ఇక ఫ్లాట్‌ఫామ్స్‌కు సులువుగా చేరుకునే విధంగా లిప్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఉత్తర, దక్షిణ దిశల్లో రెండు భారీ భవన సముదాయాలు నిర్మించనున్నారు. వీటన్నింటి కోసం రూ.321 కోట్లు ఖర్చు చేయనున్నారు. దక్షిణ దిశలో నిర్మిస్తున్న భారీ భవనం ఇప్పుడే పూర్తి కావొచ్చింది. దీనిని మార్చి నాటికి ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది. ఇక ఉత్తర దిశ భవనం డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

అత్యాధునిక సౌకర్యాలు

ఇక ఆధునీకరణ పనుల్లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లలో ప్రపంచస్థాయి అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. సీసీ టీవీ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, ఆర్వీఎఫ్ బలగాల భద్రత పెంపు వంటివి ఉండనున్నాయి. ఇక ప్రయాణికుల కోసం రెండు ఎయిర్ కాన్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. 61 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వీటిని నెలకొల్పనున్నారు. ప్రయాణికుల కాలక్షేపం కూడా ఇవి సహాయపడనున్నాయి. ఇక రూఫ్ ప్లాజ్, టాయిలెట్లు, కుర్చీలు, విశ్రాంతి బల్లలు వంట సౌకర్యాలు ఉండనున్నాయి. అటు తిరుపతికి రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *