Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే


Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామసంవత్సరం నుంచి శ్రీపరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో జరగనున్న ‘ఉగాది ఆస్థానం’ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించోమని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు కలగకుండా, రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *