Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ

Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ


బిగ్‌బాస్ సీజన్ 9..! ఈ సీజన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి పేరు తనూజ పుట్ట స్వామి. షో బిగినింగ్‌లో కాస్త మెతకగా.. చాదస్తంగా ఉన్న ఈమె.. ఆ తర్వాత తన పెర్ఫార్మెన్స్‌తో గడుసుతనంతో.. బీబీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. షో విన్నర్ అనే కామెంట్ తెచ్చుకుంది. కట్ చేస్తే.. రన్నరప్ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నెట్టింట తనూజ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె ఫ్యాన్స్ ఇంకా.. ఈ బ్యూటీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ టైమ్ తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాలో ముచ్చట్లు పెట్టింది తనూజ. ఫ్యాన్స్ అడిగిన ప్రతీ ప్రశ్నకు ఓపికగా ఆన్సర్ ఇచ్చింది. అలా ఆన్సర్ ఇస్తూనే తన ఎదుగుదలకు … పవన్‌ సాయి కారణం అంటూ.. అసలు విషయం చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ జర్నీలో పవన్ సాయి హార్డ్ వర్క్ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంతగా నిలదొక్కుకోవడానికి తన వెనుక ఉన్న బలమైన శక్తి పవన్ సాయి అని అన్నారు తనూజ. పవన్ సాయి ఎప్పుడు తనకు అండగా ఉంటాడని.. అది తన అదృష్టం అని అన్నారు. అయితే తన వల్ల పవన్ నెగిటివ్ అయినందుకు చాలా బాధపడ్డానని.. అయినా సరే నవ్వుతూ ఏదీ శాశ్వాతం కాదని మన పని మీద మనమే దృష్టి పెట్టాలని చెప్తాడంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు తనకు కావాల్సిన బలాన్ని.. తన మాటలతోనే అందిస్తాడని తనూజ చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *