హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి తుది ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. దసరా పండగలోపు గ్రూప్ 2 పోస్టుల తుది ఫలితాలను వెల్లడించి, నియామకపత్రాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు నెలల తరబడి నానుతున్న గ్రూప్ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల తుది ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడయ్యాకే గ్రూప్ 2కి మార్గం సుగమం అవుతుందనే కమిషన్ నిబంధన కూడా నెరవేరినట్లైంది. ఈ క్రమంలో గ్రూప్ 2 పోస్టులకు మరో నాలుగైదు రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తుంది.
కాగా టీజీపీఎస్సీ 2022లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీచేసింది. ఇక 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తైంది. యూనిఫాం పోస్టులకు అర్హులైనవారి జాబితా సైతం వచ్చేసింది. అభ్యర్థుల ప్రాధాన్యత ఆప్షన్లు తదితర విషయాలు పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను రూపొందించాలని కమిషన్ భావిస్తుంది.
IBPS Admit Card 2025 Download: ఐబీపీఎస్ 10,277 క్లర్క్ పోస్టులకు అడ్మిట్ కార్డులు విడుదల
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పరిధిలో భర్తీ చేయనున్న క్లర్క్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులకు సంబంధించి నిర్వహించనున్న రాత పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఐబీపీఎస్ నోటిఫికేషన్ కింద మొత్తం 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఈ ఏడాది నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
Download IBPS Clerk (CRP CSA-XV) 2025 Call Letter కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.