TGPSC Group 1 Toppers List: గ్రూప్‌1 ఫలితాల్లో హైదరాబాద్‌ డాక్టరమ్మ సత్తా.. ఏకంగా స్టేట్ టాప్ ర్యాంకు! మార్కులు చూశారా

TGPSC Group 1 Toppers List: గ్రూప్‌1 ఫలితాల్లో హైదరాబాద్‌ డాక్టరమ్మ సత్తా.. ఏకంగా స్టేట్ టాప్ ర్యాంకు! మార్కులు చూశారా


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: తెలంగాణ గ్రూప్‌1 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో టాప్‌-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలో టాప్‌ 10 ర్యాంకుల వివరాలను వెల్లడించారు. వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి ర్యాంకులు సాధించారన్నారు. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులు అభ్యర్ధులు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. కోర్టు కేసు కారణంగా TGPSC ఒక్క పోస్టు ఫలితం మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అయితే ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకం రద్దు అవుతుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

స్టేట్‌ టాపర్‌గా డాక్టర్‌ లక్ష్మీదీపిక..

తాజాగా విడుదల చేసిన తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాల్లో మల్టీజోన్‌ 2 కేటగిరీలో హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. లక్ష్మీ దీపికకు మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులు వచ్చాయి. ఉస్మానియాలో మెడిసిన్‌ చదివిన ఆమె గ్రూప్‌ 1లో ఉత్తమ ప్రతిభ చూపించారు. ప్రస్తుతం ఆమె ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. ఇక మల్టీజోన్‌ 1 కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని 532 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె గ్రూప్‌ 1లో ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో స్టేట్ రెండో ర్యాంకు సాధించారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేపట్టిన తొలి గ్రూప్‌ 1 పోస్టుల నియామకాలు ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 టాప్‌ 10 టాపర్లు వీరే..

  • టాప్‌ 1 ర్యాంకర్ లక్ష్మీ దీపిక
  • టాప్‌ 2 ర్యాంకర్ దాడి వెంటక రమణ
  • టాప్‌ 3 ర్యాంకర్ వంశీకృష్ణా రెడ్డి
  • టాప్‌ 4 ర్యాంకర్ జిన్నా తేజస్విని
  • టాప్‌ 5 ర్యాంకర్ సిదాల కృతిక
  • టాప్‌ 6 ర్యాంకర్ హర్ష వర్ధన్‌
  • టాప్‌ 7 ర్యాంకర్ కె అనూష
  • టాప్‌ 8 ర్యాంకర్ ఏరెండ్ల నిఖిత
  • టాప్‌ 9 ర్యాంకర్ కె భవ్య
  • టాప్‌ 10 ర్యాంకర్ శ్రీకృష్ణ సాయి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *