ఏడుపు ఆపట్లేదనే కోపంతో ఏడాది వయసున్న కుమార్తెను మద్యం మత్తులో ఉన్న తండ్రి అతి కారతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నగరానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇతని ప్రస్తుతం ఏడాది వయస్సున్న కుమార్తె కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వెంకటేశ్ తాగుడుకు బానిసగా మారాడు. రోజూ ఫుల్‌గా తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. రోజూలానే శుక్రవారం కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటేశ్ భార్యతో గొడవపెట్టుకున్నాడు.
తల్లిదండ్రులు గొడవ పడుతున్న సమయంలో అక్కడే ఉన్న తమ కూతురు ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్‌కు కుమార్తే ఏడుపు చిరాకు తెప్పించింది. దీంతో విచక్షణ కోల్పోయిన వెంకటేశ్.. ఏడుస్తున్న బిడ్డను తీసుకొని గాళ్లోకి విసిరేశాడు.దీంతో
గాల్లో ఎగిరి కిందపడిపోయిన బాలిక తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను హాస్పిటల్‌కు తరలించారు.
అయితే, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు చిన్నారి తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.