హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్ హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది.. కాగా.. గతంలో కూడా సజ్జనార్ హైదరాబాద్ సీపీగా పనిచేశారు.
ఐపీఎస్‌ల బదిలీలు ఇలా..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్, హోంశాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్, RTC ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల CPగా తఫ్సీర్ ఇక్బాల్, వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, మాదాపూర్ డీసీపీగా రీతిరాజ్ నియమితులయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు అప్పగించింది. అలాగే.. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా, పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, GAD పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ నియమితులయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..