Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా అకౌంట్లోనే డబ్బు జమ!

Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా అకౌంట్లోనే డబ్బు జమ!


Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా అకౌంట్లోనే డబ్బు జమ!

రాష్ట్రంలోని రైతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే వ్యసాయ రంగాన్ని ఆదుణీకరించేందుకు గతంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం విషయంతో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోనే సబ్సిడీ నిధులు జమ చేయాలని నిర్ణయించారు. వర్షాకాలం సీజన్‌ సన్నద్ధతపై శనివారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వ్యవసాయం యాంత్రీకరణ పథకం కింద ఎంపిక చేసిన యంత్ర పరికరాలకు రైతులు వాటా చెల్లించిన తర్వాత మిగితా 40 శాతం సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఆయా కంపెనీలకు విడుదల చేసేదని తెలిపారు. కానీ రాబోయే ఏప్రిల్ నుంచి ఈ సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని తెలిపారు. అంతేకాదు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రైతు వేదికలో సౌరవిద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే రాబోయే వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రం వ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగునంగా పంటసాగుకు అవసరమయ్యేలా 11.50 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. గతంలో మాధిరి కాకుండా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *