
ఉత్తర ఒడిస్సా గ్యాంగ్ టెక్ వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఎత్తుకు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు ఉపరితల ఆవర్తనం వాలి ఉంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ బలపడి వాయువ్య దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా మారుతుందన్నారు. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో తేలికపాటి ఉరుములతో భారీ వర్షం కురవనుంది. రేపు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తాయంది.