నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళా ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్లో వస్తువులు చోరీకి గురయ్యాయి. ఉట్కూర్ మండల కేంద్రానికి చెందిన మైమున బేగం(55)కు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదును దుండగులు అపహరించారు. నారాయణపేట బస్సు ఎక్కుతున్న క్రమంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. పాత బంగారు ఆభరణాలు అమ్మి, కొత్తవి కొనుగోలు చేసేందుకు నారాయణపేటకు వెళ్తుండగా ఈ చోరి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సదరు మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.