Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..


Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాల్సిన వయసు అది.. ఎన్నో కలలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. కానీ,ఒక కిరాతకుడి వేధింపులు ఆమె కలలను కల్లలు చేశాయి.. ఇలా సమాజంలో చాలా మంది ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది.. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి కొందరు.. కాదంటే కక్షగట్టే వారు మరికొందరు.. ఇలా ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు.. ఆ అమ్మాయి పాలిట కిరాతకుడిగా మారాడు.. ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకోవాలంటూ ఆ అమ్మాయిని వేధించాడు.. చివరకు అతని.. వేధింపులు భరించలేక గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ ఘటన సిద్దిపేట చిన్నకోడూరు మండలంలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. చిన్నకొడురు మండలానికి చెందిన 17 ఏళ్ల ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ఆ అమ్మాయికి వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు గత రెండేళ్లుగా ఈమెను ప్రేమిస్తున్నానంటూ, తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలపగా, వారు ఆ యువకుడిని పిలిచి పెద్దల ముందు ఇది మంచి పద్ధతి కాదు అని.. ఇలాంటి పనులు మానుకోవాలని మందలించి పంపారు..

అయినా కూడా, ఆ యువకుడు మారలేదు.. ఆ విద్యార్థిని చదువుతున్న కళాశాల వద్దకు వెళ్లినా.. ఆమె బంధువుల ఇంటికి వెళ్లినా.. సరే అక్కడకు వెళ్లి బెదిరింపులకు దిగడంతో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని గడ్డిమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటుకు ఆసుపత్రికి తరలించారు..అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇఖ్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *