సమాజంలో కొందరి ప్రవర్తన రోజురోజుకు దిగజారిపోతుంది. కొంతమంది మనుషులు చేసే పనులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం కూడా వీళ్లతోనే ఉంటున్నామా అని మన మీద మనకే చిరాకు వస్తుంది.. కొంతమంది చేసే పనులను చూస్తూ ఉంటే వీళ్లకన్న మృగాలే బెటర్ అన్పిస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బర్రె దూడపై బలత్కారం చేసిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని మిర్జాపల్లి గ్రామ శివారు ప్రాంతానికి చెందిన మళ్లాక్కోలా సిద్ధిరాములు గేదెల షెడ్డు వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. ఆదివారం రాత్రి దూడపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం గమనించిన యజమాని సిద్ధిరాములు.. నిందితుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎస్సై నారాయణ గౌడ్ ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్‌ను అదుపులోకి తీసుకోనీ విచారణ చేపట్టగా.. సంవత్సరం వయసు గల దూడపై బలత్కారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు…సిద్ధిరాములు మాట్లాడుతూ చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది పని చేస్తున్నట్లు చెబుతున్నారు. వారి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటంతో.. వ్యవసాయ పనులకు వెళ్లాలి ఆడవాళ్లు చాలా భయపడుతున్నట్లు చెప్పారు. స్థానికంగా పోలీసు పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..