Telangana: ఆ చేను నుంచి అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా..

Telangana: ఆ చేను నుంచి అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా..


Telangana: ఆ చేను నుంచి అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా..

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం ఢాబోలీ గ్రామంలో గంజాయి సాగు కేసు వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం సోదాలు నిర్వహించగా..  పొలంలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాణా ప్రతాప్ నేతృత్వంలోని బృందం.. రహస్య సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అథ్రం లక్ష్మణ్ (55) తన పొలంలో 10 గంజాయి మొక్కలను నాటినట్టు గుర్తించారు. వెంటనే నిందితుడిని మొక్కలతో పాటు జైనూర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి సాగు, వినియోగం, రవాణా చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు.

పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు అథ్రం లక్ష్మణ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఎటువంటి మినహాయింపులు ఉండబోవని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు. కాగా రైతులకు డబ్బు లిస్తామని ఆశజూపి స్మగ్లర్లు గంజాయి సాగువైపు మళ్లిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *