Tech Tips: మీ ఫోన్ అమ్మే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు..

Tech Tips: మీ ఫోన్ అమ్మే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు..


కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు పాత ఫోన్‌ను అమ్మేయడం లేదా ఎవరికైనా ఇచ్చేయడం చాలా సాధారణం. అయితే ఫోన్‌లోని డేటాను కేవలం డిలీట్ చేయడం లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా తొలగిపోతుందని అనుకుంటే పొరపాటే. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి మీ ఫోటోలు, చాట్‌లు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. ఇది హ్యాకింగ్, ఆర్థిక మోసాలకు దారితీయవచ్చు. అందుకే పాత ఫోన్‌ను ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

డేటా పూర్తిగా తొలగించడానికి ఏం చేయాలి?

మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు ఈ రెండు ముఖ్యమైన పనులు తప్పక చేయాలి.

గూగుల్ అకౌంట్, FRP తొలగించడం

మీరు ఆండ్రాయిడ్ 5.0 లేదా ఆ తర్వాత వెర్షన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్‌కు ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ గూగుల్ ఖాతాను తొలగించకుండా ఫోన్‌ను రీసెట్ చేస్తే కొత్త యజమాని దాన్ని ఉపయోగించలేరు.

ఎలా తొలగించాలి?: సెట్టింగ్స్‌లోకి వెళ్లి యూజర్స్ అండ్ అకౌంట్స్’ పై క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్‌ను ఎంచుకుని.. ‘రిమూవ్ అకౌంట్’ బటన్‌ను నొక్కండి.

 ఫేక్ డేటాతో నింపడం

ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత కూడా డేటాను రికవర్ చేయవచ్చు కాబట్టి మీ పాత డేటాను ఓవర్‌రైట్ చేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

ఎలా చేయాలి?: ముందుగా మీ ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేసుకోండి. ఆ తర్వాత ఫోన్ స్టోరేజ్ నిండా ఉండేలా పెద్ద సినిమాలు, అనవసరమైన వీడియోలు లేదా మరేదైనా డేటాను కాపీ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పాత డేటాపై కొత్త డేటా రికార్డవుతుంది. దీని తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఎవరైనా డేటా రికవర్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి కేవలం ఈ జంక్ ఫైల్స్ మాత్రమే దొరుకుతాయి. మీ వ్యక్తిగత సమాచారం కాదు.

మీ ఫోన్ డేటాను బ్యాకప్ చేయడం ఎలా?

మీరు పాత ఫోన్‌లోని డేటాను కొత్త ఫోన్‌లోకి మార్చుకోవాలనుకుంటే ఈ పద్ధతులు ఉపయోగపడతాయి:

ఆండ్రాయిడ్ బ్యాకప్: సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్‌పై క్లిక్ చేయండి. బ్యాకప్ ఆప్షన్ ఎంచుకుని.. బ్యాకప్ నౌపై నొక్కండి.

గూగుల్ ఫోటోస్ బ్యాకప్: గూగుల్ ఫోటోస్ యాప్‌ను తెరిచి మీ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి. ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాకప్ ఆప్షన్‌ను ఆన్ చేయండి. పాత ఫోన్‌ను సురక్షితంగా ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *