IND vs SL, Playing 11: భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్తాన్‌తో తలపడేందకు సిద్ధమైంది. అయితే, తన చిరకాల ప్రత్యర్థితో జరిగే ఫైనల్‌కు ముందు, భారత జట్టు శ్రీలంకతో ఒక చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌కు ముందు భారత జట్టు యాజమాన్యం కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. వారి స్థానంలో బెంచ్ మీద ఆటగాళ్లను బరిలోకి దింపనుంది. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీం ఇండియాలో మూడు మార్పులు చేయడం ఖాయం.
టీమిండియాలో మూడు మార్పులు..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టీమిండియాలో ఆ మూడు మార్పులు ఏమిటి? మొదటి మార్పు నిస్సందేహంగా జస్ప్రీత్ బుమ్రా అవుతుంది. అతనికి విరామం ఇవ్వవచ్చు. అర్ష్దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. అతనితో పాటు, టీం ఇండియా మరోసారి వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణాను తీసుకోవచ్చు. జట్టులో మూడవ మార్పు హార్దిక్ పాండ్యా లేదా తిలక్ వర్మ కావొచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఒకరిని తొలగించడం ద్వారా, భారత జట్టు రింకు సింగ్ లేదా జితేష్ శర్మను తీసుకోవచ్చు.
2025 ఆసియా కప్‌లో భారత్ తిరుగులేని జట్టుగా..
2025 ఆసియా కప్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును నిలబెట్టుకుని ఫైనల్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో జట్టులో కీలక మార్పులకు అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
శ్రీలంకతో భారత్ ప్లేయింగ్ 11…!
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకు సింగ్/జితేష్ శర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా/తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..