Team India: స్కూల్ బస్ డ్రైవర్ నుంచి ఛాంపియన్ టీం వరకు.. టీమిండియా విజయంలో కనిపించని హీరో అతనే..!

Team India: స్కూల్ బస్ డ్రైవర్ నుంచి ఛాంపియన్ టీం వరకు.. టీమిండియా విజయంలో కనిపించని హీరో అతనే..!


Team India: స్కూల్ బస్ డ్రైవర్ నుంచి ఛాంపియన్ టీం వరకు.. టీమిండియా విజయంలో కనిపించని హీరో అతనే..!

India Throwdown Specialist Story: ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో మరోసారి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ విజయంలో ప్రధానంగా 15 మంది ఆటగాళ్లు మెరిపించినప్పటికీ, వారి వెనుక కష్టపడిన సపోర్ట్ స్టాఫ్ పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. అందులో ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి శ్రీలంకకు చెందిన నువాన్ సెనేవిరత్నే (Nuwan Seneviratne). టీమిండియాలో “బవ్వా” అని పిలవబడే నువాన్ ప్రస్తుతం భారత జట్టుకు లెఫ్ట్ ఆర్మ్ థ్రో-డౌన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు.

భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న నువాన్..

టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నువాన్ సెనేవిరత్నే సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆయన వరల్డ్ కప్ ట్రోఫీతో కనిపించాడు.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

ఆ పోస్టులో ఆయన ఇలా రాశాడు.. “2023 – ఈ ప్రదేశం నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. 2026 – అదే ప్రదేశం కొత్త జ్ఞాపకాలను ఇచ్చింది. 2024, 2026 – వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు. ద టీజ్ టీమిండియా” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బ్యాటర్లకు కీలక ప్రాక్టీస్ అందించిన వ్యక్తి..

నువాన్ సెనేవిరత్నే భారత జట్టులో ముఖ్యంగా బ్యాటర్లకు ప్రాక్టీస్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లను ప్రత్యేకంగా సిద్ధం చేయడం ఆయన పని. వివిధ యాంగిల్స్, వేగం, వేరియేషన్లతో బౌలింగ్ తరహాలో ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారింది.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

అతని కృషి కారణంగా అనేక కీలక మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు ధైర్యంగా ఆడగలిగారు. టీమిండియా ఛాంపియన్ అయిన తర్వాత శ్రీలంక మీడియా కూడా నువాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారత విజయానికి ఒక శ్రీలంక వ్యక్తి కూడా కారణమయ్యాడని వారు ప్రశంసించారు.

స్కూల్ బస్ డ్రైవర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు..

నువాన్ సెనేవిరత్నే 1979 నవంబర్ 14న శ్రీలంక రాజధాని కొలంబోలో జన్మించారు. ఆయన ఒకప్పుడు శ్రీలంకలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడారు. అయితే 2004లో కేవలం రెండు మ్యాచ్‌ల తర్వాత ఆయన క్రికెట్ కెరీర్ నిలిచిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి ఆయన కొలంబోలో స్కూల్ బస్ డ్రైవర్ గా కూడా పనిచేశారు. అదే సమయంలో క్రికెట్ గ్రౌండ్‌లలో బ్యాటర్లకు ప్రాక్టీస్ ఇవ్వడం కొనసాగించారు.

ఎక్కువమంది చదివినది: టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

2017లో భారత జట్టు శ్రీలంక పర్యటన సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆయన ప్రతిభను గమనించారు. ఆ తరువాత ఆయనకు టీమ్ ఇండియాతో పని చేసే అవకాశం లభించింది. 2018 ఆసియా కప్ నుంచి ఆయన భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.

టీమ్ ఇండియా విజయ కథల్లో కనిపించని హీరోలు కూడా ఉంటారు. నువాన్ సెనేవిరత్నే అలాంటి వారిలో ఒకరు. స్కూల్ బస్ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన, ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అగ్ర జట్టుకు సపోర్ట్ స్టాఫ్‌గా నిలిచి రెండు వరుస టీ20 వరల్డ్ కప్ విజయాలకు తన వంతు పాత్ర పోషించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *