Team India: విజయానికి కారణం శాంసన్ కాదు.. అసలైన హీరో అతనే: గంభీర్ షాకింగ్ ప్రకటన

Team India: విజయానికి కారణం శాంసన్ కాదు.. అసలైన హీరో అతనే: గంభీర్ షాకింగ్ ప్రకటన


T20 World Cup 2026: టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అది కూడా బలమైన వెస్టిండీస్ జట్టును ఓడించి స త్తా చాటింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సూపర్-8 రౌండ్ చివరి మ్యాచ్‌లో, టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ అజేయంగా 97 పరుగులు చేశాడు. దీని ద్వారా, భారత జట్టు 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో, భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, భారత విజయానికి సంజు శాంసన్ ఒక్కడే కారణం కాదని.. ఇతర ఆటగాళ్ల సహకారం కూడా అమూల్యమైనదని అన్నారు. 19వ ఓవర్లో శివమ్ దూబే కొట్టిన రెండు ఫోర్లు సంజు శాంసన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో కీలకంగా నిలిచాయి. హార్దిక్ పాండ్యా డాట్ బాల్ కు ఔటైన తర్వాత 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన సమయంలో, దూబే వెంటనే తన బ్యాట్ తో బీభత్సం సృష్టించాడు.

ఇది కూడా చదవండి: IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?

శివం దూబే నిర్ణయాత్మక పాత్ర మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌కు అనుకూలంగా మార్చింది. టీం ఇండియా విజయానికి దూబే కూడా క్రెడిట్ ఇవ్వాలని టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు.

సాధారణంగా మ్యాచ్ ముగిసినప్పుడు మనం కొంతమంది ఆటగాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. నాకు, శివమ్ కొట్టిన ఆ రెండు ఫోర్లు సంజు 97 పరుగుల లాగే ముఖ్యమైనవి. ఇది జట్టు ఆట. ఇది ఎల్లప్పుడూ జట్టు ఆటగానే ఉంటుంది.

అందుకే కీలక దశలో దుబే కొట్టిన రెండు బౌండరీలు కూడా సంజు ఇన్నింగ్స్ లాగే ముఖ్యమైనవి. లేదంటే ఈ రోజు మనం సంజు శాంసన్ గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. అతను ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ చిన్న చిన్న సహకారాలు మ్యాచ్‌లను గెలవడానికి ఎంతో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

అయితే, పెద్ద స్కోర్లు వార్తల్లో నిలుస్తాయి. కానీ చిన్నమైనా, కీలక ఇన్నింగ్స్ లు జట్టు మ్యాచ్ గెలవడానికి సహాయపడతాయి. కాబట్టి, అలాంటి సహకారాలు చాలా ముఖ్యమైనవి. అందుకే టీం ఇండియా విజయానికి శివం దుబే కూడా కారణమని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *