Ishan Kishan: అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025 సీజన్‌కు జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ప్రకటించిన సీనియర్ పురుషుల జట్టులో ఇషాన్ కిషన్‌ను సారథిగా నియమించింది. విరాట్ సింగ్‌ను వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
తిరిగి దేశవాళీ క్రికెట్‌లోకి..
గత కొంతకాలంగా జాతీయ జట్టు నుంచి దూరంగా ఉంటూ, మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ఇషాన్ కిషన్‌కు ఈ కెప్టెన్సీ ఒక గొప్ప అవకాశంగా పరిగణించవచ్చు. అంతకుముందు 2018-19 సీజన్‌లో జార్ఖండ్‌కు సారథ్యం వహించిన ఇషాన్, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
గత రంజీ సీజన్‌లో దేశవాళీ రెడ్-బాల్ క్రికెట్ ఆడకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో, తన సొంత రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా తిరిగి రావడం అనేది జాతీయ జట్టులో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక కానుంది.
జార్ఖండ్ జట్టు మాజీ దిగ్గజాలు సౌరభ్ తివారీ, షాబాజ్ నదీమ్, వరుణ్ ఆరోన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, జార్ఖండ్ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఈ యువ జట్టుకు తన అనుభవం, దూకుడుతో కూడిన ఆటతీరు, నాయకత్వ లక్షణాలతో మార్గదర్శకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇషాన్ కిషన్‌పై ఉంది.
జార్ఖండ్ జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్ మాట్లాడుతూ, “మా జట్టు చాలామంది యువకులతో ఉంది. ఇషాన్‌కు అంతర్జాతీయ అనుభవం ఉంది. ఈ యువ జట్టుకు నాయకత్వం వహించే సామర్థ్యం అతనికి ఉంది. ఈ రంజీ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని నమ్మకంగా ఉన్నాం” అని అన్నాడు.
రంజీ ట్రోఫీ షెడ్యూల్..
ఈ ప్రతిష్టాత్మక దేశీయ టోర్నమెంట్ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో బలమైన తమిళనాడు జట్టుతో తలపడనుంది.
రంజీ ట్రోఫీలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ప్రదర్శన, అతని వ్యక్తిగత ఫామ్‌తో పాటు జార్ఖండ్ జట్టు విజయాల కోసం కీలకం కానుంది. యువ సంచలనం ఇషాన్ కిషన్, ఈ కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, టెస్ట్ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన వేదికను సృష్టించుకుంటాడో లేదో చూడాలి. క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా జార్ఖండ్ ఫ్యాన్స్, అతని నాయకత్వంలోని జట్టు ప్రదర్శనను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..