Tamannaah: గ్లామర్ ఉన్నప్పుడే జాగ్రత్త.. లేదంటే కష్టాలు తప్పవంటూ తమన్నా సంచలన వ్యాఖ్యలు

Tamannaah: గ్లామర్ ఉన్నప్పుడే జాగ్రత్త.. లేదంటే కష్టాలు తప్పవంటూ తమన్నా సంచలన వ్యాఖ్యలు


Tamannaah: గ్లామర్ ఉన్నప్పుడే జాగ్రత్త.. లేదంటే కష్టాలు తప్పవంటూ తమన్నా సంచలన వ్యాఖ్యలు

ఆమె వెండితెరపై కనిపిస్తే కుర్రకారుకు పూనకాలే. 21 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందరో వస్తుంటారు, పోతుంటారు.. కానీ ఆమె మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే ఈ సక్సెస్ వెనుక కేవలం తన గ్లామర్ మాత్రమే లేదని, పక్కాగా వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయని తాజాగా వెల్లడించింది. చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెబుతున్న ఆ స్టార్ మరెవరో కాదు.. తమన్నా భాటియా.

తండ్రి బాటలో..

తమన్నా తన 15వ ఏటనే కెరీర్ ప్రారంభించింది. అప్పట్నుండి ఆమె ఆర్థిక వ్యవహారాలను తన తండ్రి పర్యవేక్షించేవారు. “నా తండ్రి నాకు ఇచ్చిన మార్గనిర్దేశమే ఈరోజు నన్ను ఆర్థికంగా నిలబెట్టింది. సంపాదించిన ప్రతి రూపాయిని ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆయన నేర్పిన క్రమశిక్షణే నా విజయ రహస్యం” అని తమన్నా పేర్కొన్నారు. నటీనటుల కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, అందుకే దూరదృష్టితో ఆలోచించాలని ఆమె సూచించారు.

సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తమన్నా కేవలం బ్యాంకుల్లో దాచుకోకుండా, తెలివిగా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి రంగాల్లో పెట్టుబడిగా మళ్లించారు. ప్రస్తుతం ఆమె సొంతంగా నగల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అవకాశాలు వరుస కడుతున్న సమయంలోనే ఇతర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలని, లేనిపక్షంలో కెరీర్ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తన సహచర నటీనటులను హెచ్చరించారు.

ఆర్థిక వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమాల విషయంలో తమన్నా తన వేగాన్ని తగ్గించడం లేదు. ఈ ఏడాది ఆమె భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ మే 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అజయ్ దేవగణ్, సంజయ్ దత్ వంటి స్టార్లతో కలిసి ‘రేంజర్’ అనే చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించాలని తమన్నా చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కేవలం నటులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఆమె చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *