T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?

T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?


T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల నిరీక్షణకు తెరదించుతూ.. రేపు (మార్చి 8, ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్లలోని వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మూడుసార్లు ఫైనల్లో తలపడగా.. కివీస్ రెండు సార్లు, భారత్ ఒకసారి గెలిచాయి. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరో తేల్చుకునే సమయం ఆసన్నమైంది. మరి ఈ హై-ఓల్టేజ్ మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫ్రీగా చూడవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మ్యాచ్ సమయం, వేదిక

ఈ మెగా ఫైనల్ ఫైట్ మార్చి 8వ తేదీ ఆదివారం సాయంత్రం జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ చారిత్రాత్మక పోరుకు ఆతిథ్యమిస్తోంది. లక్షలాది మంది ప్రేక్షకుల కేరింతల మధ్య టీమిండియా కప్పును ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

టీవీ, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఈ మ్యాచ్‌ను భారత్‌లో టీవీలో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో వీక్షించవచ్చు. అయితే, దీని కోసం మీరు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో చూడాలనుకునే వారికి జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అవసరం కావచ్చు.

ఫ్రీగా చూడటం ఎలా?

మీరు పైసా ఖర్చు లేకుండా ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే.. డీడీ స్పోర్ట్స్ ఛానల్ మీకు అందుబాటులో ఉంది. అయితే, ఇది కేవలం డీడీ ఫ్రీ డిష్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ కేబుల్ లేదా డిటిహెచ్ కనెక్షన్‌లలో డీడీ స్పోర్ట్స్ మ్యాచ్‌ను ప్రసారం చేయదు. కాబట్టి ఫ్రీ డిష్ ఉన్నవారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఉచితంగా ఫైనల్ మజాను ఆస్వాదించవచ్చు.

ఇరు జట్ల బలాబలాలు – స్క్వాడ్ వివరాలు

టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అటు కివీస్ జట్టులో మిచెల్ శాంట్నర్ నాయకత్వంలో ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర వంటి ప్రమాదకర ఆటగాళ్లు భారత్‌ను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, మహమ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, కైల్ జెమీసన్, కోల్ మెక్కాన్చీ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *