T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం షురూ..మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం షురూ..మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?


న్యూజిలాండ్ కీలక ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేను కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఎడమ స్నాయువు గాయం కారణంగా మిల్నే టీ20 ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో కైల్ జామిసన్‌కు చోటు దక్కింది.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్-8 పోరాటాలు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు దూసుకెళ్లగా, తాజాగా న్యూజిలాండ్ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. శనివారం పల్లెకెలె వేదికగా జరిగిన చావోరేవో పోరులో పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఇంటిబాట పట్టింది. దీంతో కివీస్ జట్టుకు సెమీస్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో టోర్నీలో మొదటి సెమీఫైనల్ పోరు ఎవరెవరి మధ్య జరుగుతుందో క్లారిటీ వచ్చేసింది.

శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. కానీ, ఆ జట్టు కేవలం 5 పరుగుల స్వల్ప తేడాతోనే విజయం సాధించింది. దీనివల్ల నెట్ రన్ రేట్‌లో న్యూజిలాండ్‌ను అధిగమించలేకపోయింది. ఫలితంగా గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్ మొదటి స్థానంలో, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచాయి. ఇక గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మొదటి సెమీఫైనల్ పోరు మార్చి 4వ తేదీన కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది.

ఈ సెమీఫైనల్ మ్యాచ్ 11 ఏళ్ల క్రితం నాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్ గెలిచి ఫైనల్ చేరింది. ఇప్పుడు మరోసారి సెమీస్‌లో తలపడుతుండటంతో సౌతాఫ్రికా పాత బాకీ తీర్చుకుంటుందా లేక కివీస్ మరోసారి పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత టీ20 వరల్డ్ కప్ రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.

ఇక రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. గ్రూప్-2 టాపర్ అయిన ఇంగ్లాండ్ ఇప్పటికే ఈ రేసులో ఉంది. అయితే ఇంగ్లాండ్‌ను ఢీకొట్టే రెండో జట్టు ఏదో ఆదివారం (మార్చి 1) తేలిపోనుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే నిర్ణయాత్మక పోరులో గెలిచిన జట్టు సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే, వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ భారత్-ఇంగ్లాండ్ తలపడినట్లు అవుతుంది. 2022లో ఇంగ్లాండ్, 2024లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. విచిత్రమేమిటంటే ఆ సెమీస్‌లో గెలిచిన జట్టే ఆ తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *