ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా- శ్రీలంక మ్యాచ్ టై . బ్యాట్స్ మెన్ రాణించారు. యువ విధ్వంసక బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో, అభిషేక్ ఈ సీజన్‌లో తన ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆసియా కప్ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు మీద ఉన్నాడు. చివరి సూపర్ 4 గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా అతను భారత్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించగలిగాడు.
ఈ మ్యాచ్‌లో అతను ప్రత్యేక జాబితాలో ఉన్న అనేక మంది దిగ్గజాలను అధిగమించి చరిత్ర సృష్టించాడు. అభిషేక్ శర్మ ఒకేసారి పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను అధిగమించాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్, దూకుడు విధానంతో బౌలర్లను ఇబ్బంది పెట్టిన ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ బ్యాటింగ్ స్థిరంగా వార్తల్లో నిలిచింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ కూడా బ్యాటింగ్ తో అదరగొట్టారు. ఫలితంగా మ్యాచ్ టై గా నిలిచింది.