Sunil: ఏం చేంజ్ గురూ.. అప్పుడు సునీల్ పక్కన పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

Sunil: ఏం చేంజ్ గురూ.. అప్పుడు సునీల్ పక్కన పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..


తెలుగు సినీ పరిశ్రమలో నటిగా ఎదగాలని చాలా మంది అమ్మాయిలు అడుగుపెడుతుంటారు. కానీ సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, అవమానాలను భరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తారలు చాలా తక్కువ. కొందరు వరుస సినిమాలతో దూసుకుపోతుంటారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. పైన సునీల్ పక్కన కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టరా..? తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే వరుస సినిమాల్లో నటిస్తుంది. ఆమె పేరు మియా జార్జ్.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

ఇవి కూడా చదవండి

2010లో వచ్చిన ఒరు స్మాల్ ఫ్యామిలీ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసింది. ఆ తర్వాత చెట్టయిస్ సినిమాతో కథానాయికగా మారారు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

దీంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత మియా జార్జ్ తెలుగులో మరో మూవీ చేయలేదు. 2020లో అశ్విన్ పిలిప్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికి పాప జన్మించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *