సుడిగాలి సుధీర్… తెలుగు టీవీ ఇండస్ట్రీలో తోపు సెలబ్రిటీ. అద్భుతంగా తనని తాను మలుచుకున్నాడు. చిన్న మేజిక్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో అలరించి.. ఇప్పుడు పలు షోలకు హోస్ట్‌గా కూాడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లో కమెడియన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆపై ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫలితం పెద్దగా ఆశజనకంలా ఏం లేదు. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత.. ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ తర్వాత హీరోగా చేసిన వాంటెడ్ పండుగాడు, త్రీ మంకీస్, గాలోడు, కాలింగ సహస్త్ర సినిమాలు సైతం మంచి సక్సెస్‌ను ఇవ్వలేదు. అప్పుడెప్పుడో ప్రారంభించిన గోట్ సినిమా ఇంతవరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మరో సినిమను అనౌన్స్ చేశాడు సుధీర్. ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ అంటూ.. పెద్ద బాధ్యతనే బుజాలకు ఎత్తుకున్నాడు. రామ్ చరణ్ వీరాభిమాని శివ చెర్రీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘SS 5’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని.. పాన్ వరల్డ్ మూవీగా ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభం కానుంది. తాజాగా 12 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో టైటిల్ కార్డు రివీల్ చేశారు. శివ చెర్రీ.. వజ్ర వారాహి సినిమాస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి.. తొలి ప్రయత్నంగా ఈ మూవీ చేస్తున్నారు.
With hearts full of hope and dreams ❤️🔥
Team #VajraVarahiCinemas begins their Production No.1 ❤️
Auspicious Pooja Ceremony on September 29th,Tomorrow, 10 AM at Ramanaidu Studios, Hyderabad.@VVCOffl pic.twitter.com/puuA4hhSiG
— Vajra Varahi Cinemas (@VVCOffl) September 28, 2025
సుడిగాలి సుధీర్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై అతనికి చాలా మంది సజీషన్స్ ఇస్తున్నారు. నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదంటున్నారు. తొలుత తెలుగులో మంచి హీరోగా పేరు తెచ్చుకుని.. మార్కెట్ పెంచుకున్నాక ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బెటర్ అన్నది వారి వెర్షన్. లేదంటే తనతో పాటు చిత్రాలు నిర్మించే నిర్మాతలు కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని చెబుతున్నారు. అందరూ హిట్ అవ్వాలనే సినిమాలు తీస్తారు.. కానీ మన సక్సెస్ రేట్ ఎంత..? మార్కెట్ లెవల్ ఏంటో తెలుసుకుని ముందుకు సాగితే బెటర్ అన్నది నెటిజన్స్ వెర్షన్.