Successs story: తండ్రి అనాథాశ్రమంలో వదిలేశాడు.. రూ. 5 కోసం కూలికి వెళ్ళిన మహిళ నేడు అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త

Successs story: తండ్రి అనాథాశ్రమంలో వదిలేశాడు.. రూ. 5 కోసం కూలికి వెళ్ళిన మహిళ  నేడు అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త


తెలంగాణలోని వరంగల్‌లో ఐదుగురు సభ్యులున్న పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి రెడ్డిని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనాథాశ్రమానికి పంపారు. 10 సంవత్సరాల వయసులో శాశ్వతంగా జ్యోతి రెడ్డి అడ్రస్ మారిపోయింది. ఆమె తండ్రి చిన్నారి జ్యోతిని పోషించలేక అనాథాశ్రమానికి పంపాడు. భావోద్వేగ గాయం తగిలినా.. ఆమె బలంగా నిలబడింది, ప్రభుత్వ పాఠశాలలో చదివింది. నిశ్శబ్దంగా పెద్ద కలలను కంటూనే ఉంది. జ్యోతి రెడ్డి 16 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. 18 ఏళ్లకే తల్లి అయింది. తన కుటుంబాన్ని పోషించేందుకు వ్యవసాయ కూలీగా మారింది. రోజుకు రూ.5 సంపాదించేది.

అయినా సరే తనకు, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా అన్న ఆలోచనను ఎప్పుడూ వదులుకోలేదు. తన పరిస్థితులను మార్చుకోవాలని నిశ్చయించుకున్న ఆమె ఉపాధ్యాయురాలిగా మారింది. 1994లో బి.ఎ. పూర్తి చేసింది. 1997లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. నెలకు కేవలం రూ. 398 సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రి సమయంలో బట్టలు కుట్టేది.

అమెరికా నుండి వచ్చిన బంధువు విదేశీ జీవితం గురించి మాట్లాడినప్పుడు అంతా మారిపోయింది. భర్త నిరాకరించినప్పటికీ జ్యోతి కంప్యూటర్ కోర్సులునెర్చుకుని అమెరికాకు కలలను మోసుకుంటూ వెళ్లింది. మొదటి పెట్రోల్ బంకుల నుంచి బేబీ సిట్టింగ్ వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ప్రతి డాలర్‌ను ఆదా చేసింది.

ఇవి కూడా చదవండి

2001లో, 40,000 డాలర్ల పొదుపుతో జ్యోతి కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను స్థాపించింది. చిన్న టెక్ వెంచర్‌గా ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి నెమ్మదిగా బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగింది. ఇది జ్యోతి ప్రయాణం ఆమె కృషి, పట్టుదల దృఢ సంకల్పానికి నిదర్శనం.

జ్యోతి కథ భారతదేశంలోని చిన్న తనంలోనే వివాహం చేసుకునే యువతతో పాటు సామాజిక సమస్యలను హైలైట్ చేస్తుంది. పేదరికం నుంచి CEO అయ్యే వరకు ఆమె ప్రయాణం మహిళల దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. జ్యోతి ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున వరంగల్‌లోని అనాథాశ్రమాలను సందర్శిస్తుంది. అవసరంలో ఉన్న పిల్లలకు స్పాన్సర్‌షిప్ అందిస్తుంది.

ఒక అనాథాశ్రమం నుంచి బిలియన్ డాలర్ల కంపెనీని నడిపించడం వరకు జ్యోతి రెడ్డి చేసిన అద్భుతమైన ప్రయాణం సంకల్పం, కృషి, విద్య, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించే సహాయక వాతావరణం సృష్టించడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *