Success Habits: రోజూ ఈవెనింగ్ ఇలా చేస్తే.. సక్సెస్ మీకు దాసోహం అవ్వడం పక్కా!

Success Habits: రోజూ ఈవెనింగ్ ఇలా చేస్తే.. సక్సెస్ మీకు దాసోహం అవ్వడం పక్కా!


చిన్న చిన్న అలవాట్లే జీవితంలో పెద్ద మార్పుని తీసుకురాగలవు. ముఖ్యంగా ఎందులోనైనా సక్సెస్ అవ్వాలనుకునేవాళ్లు మీ సాయంత్రం దినచర్యలో కొన్ని అలవాట్లను చేర్చుకుని చూడండి. కొంతకాలానికి డిఫరెన్స్ మీరే చూస్తారు.  ప్రపంచంలోని సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అంతా దాదాపు ఇవే అలవాట్లను ఫాలో అవుతారట. మరి అలాంటి 10 బెస్ట్ ఈవెనింగ్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా?

రేపటి కోసం ప్లాన్

సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత చాలామంది తీరిగ్గా రిలాక్స్ అవుతారు. ఇది మంచిదే. అయితే ఇలా రిలాక్స్ అయ్యేటప్పుడే రేపటి కోసం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. సక్సె్స్‌పుల్ పర్సన్స్ అందరూ ఇలాగే చేస్తారు. తెల్లారి పొద్దున్నే ఒత్తిడి లేకుండా ముందు రోజు పనులను ప్లాన్ చేసుకుంటారు.

డే రివ్యూ

మీ రోజంతా ఎలా సాగిందో ప్రతిరోజూ సాయంత్రం రివ్యూ చేసుకోవాలి. ఈ రోజు చేసిన మిస్టేక్స్, నేర్చుకున్న లెసన్స్.. ఇలా రోజులో జరిగిన విషయాలను ఒకసారి రివ్యూ చేసుకుంటే ప్రతిరోజూ కొద్దికొద్దిగా ఎదుగుతుంటారు. ఇది విజయానికి తొలిమెట్టు వంటిది.

వర్క్ నుంచి డిస్‌కనెక్ట్

పని అయిపోయిన తర్వాత పని గురించి మర్చిపోయి పర్సనల్ లైఫ్ లోకి వచ్చేయాలి. మీరు సాధించాలనుకున్న దాని గురించి ఆలోచించాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోలేకపోతే  జీవితంలో ఎదగడం కష్టమవుతుంది.

కొత్తగా ఏదైనా..

ఇకపోతే ప్రతి రోజూ సాయంత్రం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి. ఉదాహరణకు ఏదైనా పుస్తకం చదవొచ్చు. ఆన్ లైన్ లో ఏదైనా నేర్చుకోవచ్చు. ఇలా రోజూ మిమ్మల్ని మీరు సాన పెట్టుకుండూ ఉండాలి.

ఎక్సర్‌‌సైజ్

ప్రతిరోజూ ఈవెనింగ్ కొంత సమయం ఎక్సర్‌‌సైజుకి కేటాయించాలి. శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడే మనసు కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఎమోషన్స్  కంట్రోల్ లో ఉంటాయి. సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎప్పుడూ ఎక్సర్ సైజ్ ను మిస్ చేయరు.

గ్రాటిట్యూడ్

ప్రతిరోజూ సాయత్రం రిలాక్స్‌డ్ గా కూర్చుని మీకు నచ్చని విషయాలు, కోపం తెప్పించే విషయాలను గుర్తుకు తెచ్చుకుని వాటిని భరిస్తున్నట్టు, క్షమిస్తున్నట్టు భావన చెందాలి. జీవితం మీకు ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావనతో ఉండాలి. ఇలా చేస్తే మీ మనసు రోజురోజుకీ తేలిక అవుతుంది. మీ గోల్ పై ఫోకస్ పెరుగుతుంది.

ఫోన్ వద్దు

చాలామంది ఈవెనింగ్ కాస్త టైం దొరగ్గానే ఫోన్ లో మునిగిపోతుంటారు. దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా నిద్రలేమి వంటి సమస్యలొస్తాయి. కాబట్టి రాత్రివేళల్లొ ఫోన్ వాడడాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి.

క్వాలిటీ టైం

మానసిక ఆరోగ్యానికి క్వాలిటీ టైం గడపడం చాలాముఖ్యం. అంటే మీకు బాగా నచ్చిన పని కోసం కొంత సమయం గడపాలి. అది ఫ్యామిలీతో గడపడం కావొచ్చు. పిల్లలతో ఆడుకోవడం కావొచ్చు. లేదా ఏదైనా ఆటలు ఆడడం.. ఇలా మనసుకి నచ్చిన దానికోసం కొంత సమయం కేటాయించాలి.

మెడిటేషన్

మెడిటేషన్ చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ప్రతి రోజూ సాయంత్రం లేదా పడుకునే ముందు ఒక 20 నిముషాల పాటు ధ్యానం చేయండి. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఒత్తిడి, డిప్రెషన్ వంటివ ఉంటే  పూర్తిగా తగ్గుతాయి.

మంచి నిద్ర

ఇక అన్నింటికంటే ముఖ్యమైనది.. నిద్ర. రోజూ ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం ఆరు నుంచి ఏడు గంటల సుఖ నిద్ర ఉండేలా చూసుకోవాలి.  సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరూ క్వాలిటి నిద్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *