Success Astrology: పట్టు వదలని విక్రమార్కులు..! వారు అనుకున్నది సాధిస్తారు..

Success Astrology: పట్టు వదలని విక్రమార్కులు..! వారు అనుకున్నది సాధిస్తారు..


Success Astrology: పట్టు వదలని విక్రమార్కులు..! వారు అనుకున్నది సాధిస్తారు..

ప్రస్తుతం కుంభ రాశిలో రెండు నెలల పాటు కుజ, బుధులు సంచారం చేయబోతున్నాయి. సాధారణంగా ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో యుతి చెందినా, పరస్పరం వీక్షించుకున్నా కొన్ని అనుకూల రాశుల వారిలో విపరీతంగా పట్టుదల పెరుగుతుంది. లక్ష్యాలు, ఆశయాలను అతి తక్కువ కాలంలో సాధించుకోవడానికి మరింత గట్టిగా ప్రయత్నిస్తారు. వ్యక్తిగతంగా ఈ రాశులవారికి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయత్నాలు, ప్రయోగాలు ఎక్కువగా చేస్తారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించే తత్వం కలిగిన బుధుడు, దూకుడుతత్వం కలిగిన కుజుడు కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు లబ్ధి పొందుతారు.

  1. మేషం: నాయకత్వ లక్షణాలు, పట్టుదల, పోరాట పటిమ, ఏ రంగంలో ఉన్నా అగ్ర స్థానంలో ఉండాలనే కోరిక బాగా ఎక్కువగా కలిగిన ఈ రాశికి లాభ స్థానంలో ఈ కుజ, బుధులు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి గట్టి పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ఆస్తి వివాదాన్ని రాజీమార్గంలో పరిష్కరించుకుని విలువైన ఆస్తిని పొందడం జరుగుతుంది.
  2. వృషభం: ప్లానింగుకు, గట్టి పట్టుదలకు మారుపేరైన ఈ రాశికి దశమ స్థానంలో బుధ, కుజులు యుతి చెందడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా పదోన్నతులు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి, ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధికి అనేక విధాలుగా ప్రయత్నించి సఫలమయ్యే అవకాశం ఉంది.
  3. మిథునం: ఆర్థిక, వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించే ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడు కుజుడితో కలవడం వల్ల ఆదాయ వృద్ధికి, ఆర్థిక సమస్యల పరిష్కారానికి గట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అవసరమైతే పోరాటం జరిపి అయినా ఈ రాశివారు పదోన్నతులు సంపాదించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము తోపాటు బాకీలను కూడా రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా లాభాలు పొందుతారు.
  4. తుల: ఏ రంగంలో ఉన్నా లాభాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదురు చూసే ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా లాభాలను పెంచుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఏ రంగంలో ఉన్నా సమర్థతను నిరూపించుకుంటారు.
  5. ధనుస్సు: ఏ రంగంలో ఉన్నా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించే ఈ రాశివారికి తృతీయ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల తమ లక్ష్య సాధనకు మరింతగా ప్రయత్నాలు సాగిస్తారు. వీరు ఎంతో పట్టుదలగా వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. సరి కొత్త ఆలోచనలతో వ్యాపారాల్లో లాభాలను బాగా పెంచుతారు. ఉద్యోగంలో తమ సమర్థతను, ప్రతిభను నిరూపించుకుని పదోన్నతులు పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
  6. మకరం: ఒక ప్రణాళిక ప్రకారం ఏ పనినైనా సాధించుకోవడం, పట్టిన పట్టు విడువకపోవడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశికి దశమ స్థానంలో కుజ, బుధుల కుజుడి సంచారం వల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఆస్తిపాస్తుల సమస్యల్ని గట్టి ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ప్రేమలు, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేస్తారు. సొంత ఇల్లు అమరుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *