Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు


Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

అయితే, ఫిట్‌నెస్‌ అంటే కేవలం జిమ్‌కు వెళ్లి గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు. కేవలం రెండు నిమిషాల వ్యాయామంతో కూడా అద్భుతాలు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం మనం చేసే తీర్మానాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా? మన జీవనశైలిని పరిగణనలోకి తీసుకోకుండా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడమే అందుకు ప్రధాన కారణం. నిజానికి ఫిట్‌గా ఉండటానికి ఏసీ గదుల్లో గంటల తరబడి వర్కవుట్లు చేయక్కర్లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరణించే అవకాశం 20-30% ఎక్కువగా ఉంటుంది. కానీ మన చుట్టూనే ఉండి, మనం రోజూ చూసే ఒక చిన్న పని మన ప్రాణాలను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎంతో ఖరీదైన జిమ్ పరికరాలు చేయలేని మ్యాజిక్ ను ఆ చిన్న పని చేస్తుంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అద్భుత ఫలితాలు..

హార్వర్డ్ నివేదిక ప్రకారం, రోజుకు కేవలం రెండు నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వారానికి కేవలం 15 నిమిషాల వ్యాయామం మరణాల ముప్పును 18% తగ్గిస్తుంది. అదేవిధంగా వారానికి 19 నిమిషాలు కేటాయిస్తే గుండె జబ్బుల ముప్పు 40% తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. “ప్రతి చిన్న శారీరక శ్రమ శరీరానికి లెక్కలోకి వస్తుంది” అని కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం లేని వారికి మెట్లెక్కడం ఒక వరమనే చెప్పాలి. రోజుకు రెండు మూడు సార్లు మెట్లు ఎక్కడం వల్ల జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. మెట్లెక్కడం వల్ల శరీరం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల వేగంగా నడవడం కంటే కూడా మెట్లెక్కడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి, ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది.

మెట్లెక్కడం వల్ల ప్రయోజనాలు

  • గుండె ఆరోగ్యం- మెట్లెక్కడం వల్ల విశ్రాంతి సమయంలో ఉండే గుండె వేగం తగ్గుతుంది, ఇది ఆరోగ్యకరమైన గుండెకు సంకేతం.
  • కండరాల దృఢత్వం- ఇది ప్రధానంగా శరీర కింది భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. కింది భాగం బలంగా ఉండటం అనేది దీర్ఘాయువుకు ఒక సూచిక.
  • జ్ఞాపకశక్తి- మెట్లెక్కడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
  • బరువు నియంత్రణ- గర్భిణీ స్త్రీలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

జిమ్ మెంబర్‌షిప్ వృథా అయిందని బాధపడటం మానేసి, మన రోజువారీ పనుల్లోనే వ్యాయామాన్ని వెతుక్కోవాలి. డాక్టర్లు వద్దని చెబితే తప్ప, సాధ్యమైనంత వరకు లిఫ్టులు, ఎస్కలేటర్లను పక్కన పెట్టండి. రోజుకు కనీసం రెండు మూడు అంతస్తులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మీ ఆయుష్షును పెంచుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *