లోన్ అప్రూవ్ అయింది అంటూ, ఫ్రీ క్రెడిట్ కార్డు అంటూ.. రోజులో చాలా స్పామ్ కాల్స్ విసిగిస్తుంటాయి. అయితే వీటివల్ల కేవలం సమయం వృథా అవ్వడమే కాదు, కొన్ని సార్లు స్కామ్‌ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీటికి చెక్ పెట్టడం చాలా మంచిది. దీనికోసం ఏం చేయాలంటే..
డీఎన్‌డీ
స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయాలంటే.. మీ సిమ్ ను బట్టి ఎయిర్‌టెల్, జియో, వీఐ యాప్స్‌లోకి వెళ్లి అక్కడ సెట్టింగ్స్ లేదా సర్వీసెస్‌లోకి వెళ్లి ‘డీఎన్‌డీ(DND)’ అనే ఆప్షన్ కోసం వెతకాలి. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే వీలైనంత వరకూ ఆటోమేటెడ్ కాల్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఫోన్‌లో మెసేజ్ యాప్‌లోకి వెళ్లి అక్కడ ‘ఫుల్లీ బ్లాక్ (FULLY BLOCK)’ అని మెసేజ్ టైప్ చేసి దాన్ని 1909 నెంబర్‌కు సెండ్ చేయాలి. లేదఅ 1909 నెంబర్ కు కాల్ చేసి కూడా బ్లాక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా టెలీ మార్కెటింగ్ కాల్స్ తగ్గే అవకాశం ఉంది.
కాలర్ ఐడీ అండ్ స్పామ్
ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్లు గూగుల్ డయలర్‌లోకి వెళ్లి అక్కడ పైన కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి మెనూలోకి వెళ్లాలి. అక్కడ సెటింగ్స్‌లో ‘కాలర్ ఐడీ అండ్ స్పామ్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ‘ఎనేబుల్ ఫిల్టర్ స్పామ్ కాల్స్’ అనే ఆప్షన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటెడ్ స్పామ్ కాల్స్ బ్లాక్ అయిపోతాయి. అయితే ఇలా చేయడం కోసం ముందుగా గూగుల్ డయలర్‌ను డీఫాల్ట్ డయలర్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రూ కాలర్
ట్రూ కాలర్ యాప్ ద్వారా కూడా స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టొచ్చు. మీకు తరచుగా వచ్చే స్పామ్ కాల్స్ కు స్టార్టింగ్ నెంబర్ ఒకేలా ఉంటుంది. వాటిని ట్రూ కాలర్ బ్లాక్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ట్రూ కాలర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ బ్లాకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. మ్యానేజ్ బ్లా్క్ లిస్ట్‌లోకి వెళ్లాలి. అక్కడ స్టార్టింగ్ నెంబర్స్ ఎంటర్ చేసి బ్లాక్ చేయొచ్చు. అలాగే స్పామ్ కాల్ వచ్చిన ప్రతి సారీ దాన్ని స్పామ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తే.. ఇకపై ఆ నెంబర్ నుంచి కాల్స్ రాకుండా ఉంటాయి.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..