మరికాసేపట్లో సూర్యగ్రహణం. రాత్రి 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 3 గంటల 23 నిమిషాలకు విడుస్తుంది. కానీ.. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఆసియాలో ఇండియా, శ్రీలంక, నేపాల్, UAE, ఆఫ్ఘనిస్తాన్లో కనిపించదు. ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని చూడలేరు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తూర్పు తీరం, పసిఫిక్ దీవులు, ఆంటార్కిటికాకు మాత్రమే పరిమితమవుతుంది.
ఈసారి సూర్య గ్రహణం ఓ అరుదైన సంభవం. ఎందుకంటే, ఆదివారం-అమావాస్య, మామూలు అమావాస్య కాదు, మహాలయ అమావాస్య.. సర్వ పితృ అమావాస్య. సరిగ్గా ఇవాళే సూర్య గ్రహణం. కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని సిద్ధాంతులు.. అంత సీనే లేదని హేతువాదులు..! ఎవరి వెర్షన్ వాళ్లది. మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి భయం లేదు, బట్ కండిషన్స్ అప్లయ్ అనేది జోతిష్యుల మాట.
సూర్యగ్రహణం అనగానే, ప్రజల్లో అనేక నమ్మకాలు. రాహు అనే దెయ్యం సూర్యుడిని మింగేయడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, గ్రహణం రోజు సూర్యుని కాంతి తగ్గడం వల్ల దుష్ట శక్తులు ప్రబలుతాయని ఒక విశ్వాసం. స్వేచ్ఛగా తిరిగే ఆత్మలను వశపరుచుకోడానికి బ్లాక్ మ్యాజిక్ చేస్తారన్న మాటలూ గట్టిగానే వినిపించాయి. గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభయ్యే సూతక కాలాన్ని కూడా అశుభంగా భావిస్తుంటారు. ఈ సమయంలో శుభకార్యాలు పెట్టుకోకూడదంటారు. కానీ, ఇదంతా ట్రాష్ అంటారు సైంటిస్టులు. ప్రస్తుతానికైతే మన దేశంలో అటువంటి ఫియర్స్ అయితే ఏమీ లేవు.
గ్రహణం ఏదైనా అదొక ఖగోళ ప్రక్రియ మాత్రమే అనేది హేతువాదుల వెర్షన్. వీటన్నికీ అతీతమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాదిలో ఇది రెండో పాక్షిక సూర్య గ్రహణం. ఇదే చివరి అతి పెద్ద సూర్య గ్రహణం కూడా..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..