పాములను చూడగానే చాలామంది దడుచుకుంటారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. సాధారణంగా పాములు అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో.. ఎక్కువగా ఉంటాయి. అయితే ఎండాకాలంలో వేడి తాపానికి, వర్షాకాలంలో ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. ప్రజంట్ రెయినీ సీజన్ కావడంతో.. ఎక్కడపడితే అక్కడ దూరుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పాముకాటుకు గురయ్యే అవకాశం ఉంది.
అయితే తాజాగా ఓ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అందులో ఓ పాము రోడ్డుపై పిల్లలకు జన్మనిస్తుంది. కొందరు వ్యక్తి ఆ దృశ్యాలు రికార్డు చేశారు. అయితే మెజార్టీ పాములు గుడ్లు పెడతాయి. రక్తపింజర లాంటి కొన్ని జాతుల పాములు మాత్రమే పిల్లలకు డైరెక్ట్ జన్మనిస్తాయి. ఈ పాము జనాలు వీడియో రికార్డు చేస్తుండగా.. అలా రోడ్డుపైనే 6, 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా పాము పిల్లలకు జన్మనివ్వడం తొలిసారి చూస్తున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో దిగువన మీరూ చూడండి..