Smriti Mandhana : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లోని మూడో, చివరి వన్డేలో ఆమె విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి, భారత్ తరపున వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
స్మృతి మంధాన సంచలనం
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 413 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, దాన్ని ఛేదించే క్రమంలో మంధాన తుఫానులా బ్యాటింగ్ చేసి, కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఈ సెంచరీతో ఆమె విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 52 బంతుల్లో సెంచరీ రికార్డును బద్దలు కొట్టి, భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించింది.
కోహ్లీ రికార్డుకు చెక్
2013లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ 52 బంతుల్లో సెంచరీ సాధించి, భారత పురుష క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. అయితే, ఇప్పుడు స్మృతి మంధాన కేవలం 50 బంతుల్లో సెంచరీ చేసి పురుషుల, మహిళల క్రికెట్‌లోనూ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా నిలిచింది. అంతకుముందు కూడా మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ (70 బంతుల్లో) రికార్డు ఆమె పేరిటే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన వారిలో స్మృతి మంధాన ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ 2012లో న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉంది.
మ్యాచ్ వివరాలు
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున బేత్ మూనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 138 పరుగులు చేసి, తమ జట్టు స్కోరును 412 పరుగులకు చేర్చింది. వారి ఇన్నింగ్స్‌లో అలీసా హీలీ (30), జార్జియా వోల్ (81), ఎలీస్ పెర్రీ (68) కూడా కీలక పాత్ర పోషించారు. స్మృతి మంధాన సెంచరీ తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 204/2 పరుగులు చేసింది. కానీ, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయినా, ఆమె ఒక చారిత్రక రికార్డును సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..