Smart Watches: స్మార్ట్ వాచీలు వాడుతున్నారా? ఈ డేంజర్ ఉందని తెలుసా?

Smart Watches: స్మార్ట్ వాచీలు వాడుతున్నారా? ఈ డేంజర్ ఉందని తెలుసా?


Smart Watches: స్మార్ట్ వాచీలు వాడుతున్నారా? ఈ డేంజర్ ఉందని తెలుసా?

చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచీల వల్ల వైరస్ లు, బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ, ఇదే నిజం అంటున్నారు సైంటిస్టులు. స్మార్ట్ వాచీలకు వాడే మెటీరియల్స్ వైరస్, బ్యాక్టిరియాలను అట్రాక్ట్ చేస్తున్నాయట. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయట.

ఈ మెటీరియల్స్ డేంజర్

సాధారణంగా స్మార్ట్‌వాచీలు.. రబ్బర్‌, ప్లాస్టిక్‌,  క్లాత్‌, లెదర్‌ లేదా మెటల్‌తో తయారవుతుంటాయి. ఇలాంటి మెటీరియల్స్‌ను ఎక్కువసేఫు ధరించడం వల్ల ఆ ప్రాంతంలో వేరబుల్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. జ్వరం,  డయేరియా, ఇమ్యూనిటీ తగ్గడం వంటి పలురకాల సమస్యలకు ఈ వేరబుల్ బ్యాక్టీరియా కారణమవుతుందని వాళ్లు గుర్తించారు. అలాగే కొందరిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని వాళ్లంటున్నారు.

వైరస్ ఇన్ఫెక్షన్స్

రిస్ట్ బ్యాండులు పెట్టుకునేచోట  స్టెఫిలోకాకస్ ఎస్‌పీపీ, ఇ–కొలీ, సూడోమోనాస్ ఎస్‌పీపీ వంటి పలు రకాల బ్యాక్టీరియాలు పెరుగుతున్నట్టు ఆ పరిశోధనలో తేలింది. గతంలో వాడే వాచీలో ఒరిజినల్ లెదర్, స్టీల్, గోల్డ్, సిల్వర్ వంటి మెటల్స్ వాడేవాళ్లు. వీటివల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ స్మార్ట్ వాచీలకు వాడుతున్న రబ్బర్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. రెగ్యులర్ గా వాచీలు పెట్టకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ఇలా చేయాలి

స్మార్ట్ వాచీలు అలవాటైపోయిన వాళ్లు వాటిని వాడకుండా ఉండలేరు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. స్మార్ట్ వాచీలకు ఉండే స్ట్రాప్స్ ను ఎప్పటికప్పుడు తీసి శానిటైజర్ తో శుభ్రం చేసుకుని మళ్లీ పెట్టుకోవాలి. స్మార్ట్ వాచీని కొనేటప్పుడు పీఎఫ్ఏఎస్ ఫ్రీ (PFAS-free) మెటీరియల్స్ ను వాడిన బ్రాండ్స్ ను ఎంచుకోవాలి.  అంటే పాలీఫ్లురోల్కైల్ అనే కెమికల్ లేని రబ్బర్ అని అర్థం.  ఈ రబ్బర్ వైరస్ అట్రాక్ట్ చేయదు.  ఇకపోతే ప్లాస్టిక్, రబ్బరు వంటి మెటీరియల్స్‌తో పోలిస్తే..  అల్యూమినియం, బంగారం, వెండితో తయారు చేసిన రిస్ట్‌ బ్యాండ్‌లలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని వాడడం బెటర్. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవాళ్లకు ఎక్కువ చెమట పడుతుంది. కాబట్టి వాళ్లు రోజూ రిస్ట్ బ్యాండ్‌ను క్లీన్ చేసుకోవాలి. అలాగే రిస్ట్ బ్యాండ్‌ను మరీ టైట్‌గా కాకుండా కాస్త వదులుగా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా స్టోర్ అయ్యే అవకాశం తగ్గుతుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *