Smart Phones: మార్చి 1 నుంచి పెరగనున్న వీటి ధరలు.. ఒకేసారి రూ.2,500 పెంపు.. ఇక బాదుడు తప్పదు..

Smart Phones: మార్చి 1 నుంచి పెరగనున్న వీటి ధరలు.. ఒకేసారి రూ.2,500 పెంపు.. ఇక బాదుడు తప్పదు..


కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగిలింది. మార్చి 1వ తేదీ నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయి. దీంతో కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు తమ జేబు నుంచి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ ధరలన్నీ మరో మూడు రోజుల్లో పెరగనున్నాయి. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ధరల పెంపుకు అంతా సిద్దం చేసుకున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు అయిన వివో, ఐక్యూఓ కంపెనీలు పలు మోడల్స్ ధరలను మార్చి 1 నుంచి పెంచనున్నాయి. ఈ రెండు కంపెనీలు ఇంకా అధికారికంగా ధరల పెంపును ప్రకటించలేదు. కానీ మెమెరీ కాంపోనెంట్ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచుతున్నాయి. ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఒక్కో స్మార్ట్‌ఫోన్‌పై పెరుగుదల ఉండొచ్చు.

రూ.2500 పెంపు..?

వివో టీ4 సిరీస్, ఐక్యూఓ జెడ్10 లైనప్‌లోని వివిధ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం వివో టీ4 8జీబీ+128జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.22,999గా ఉండగా.. ఇది రూ.24,999కి పెరగనుంది. ఇక 8జీబీ+256జీబీ వేరియెంట్ ధర రూ.24,999గా ఉండా.. ఇది రూ.26,999కి చేరుకోనుంది. ఇక 12జీబీ+256జీబీ వేరియెంట్ ధర ప్రస్తుతం రూ.26,999గా కొనసాగుతుండగా.. ఇది రూ.28,999కి చేరనుంది. అంటే ప్రస్తుత ధరలపై రూ.2 వేలు పెరగనుంది. ఇక వివో టీ4ఆర్ ఫోన్ల ధరలు కూడా వేరియెంట్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.2,500 వరకు పెరగనున్నాయి.

ఇక ఐక్యూఓ ఫోన్ల ధరలు ఇలా..

ఇక ఐక్యూఓ జెడ్ 10 ఫోన్ ధరల విషయానికొస్తే.. అన్ని వేరియంట్ల ఫోన్లపై రూ.2 వేలు పెరగనుంది. ప్రస్తుతం 8GB + 128GB మోడల్ ధర రూ. 24,999గా ఉండగా.. 8GB + 256GB వెర్షన్ ధర రూ. 26,999 వద్ద కొనసాగుతోంది. ఇక 12GB + 256GB కాన్ఫిగరేషన్ ధర రూ. 28,999 వద్ద కొనసాగుతోంది. ఇక ఐక్యూఓ జెడ్ 10ఆర్ ఫోన్ల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక జెడ్ 10ఎక్స్ ధరల్లో కూడా పెంపు నమోదు కావొచ్చు. 6GB + 128GB వేరియంట్ రూ. 1,500 పెరిగి రూ. 16,999 కి చేరుకోవచ్చని తెలుస్తోంది. అటు 8GB + 128GB, 8GB + 256GB వేరియెంట్ ఫోన్ ధరలు రూ. 2,500 పెరిగి రూ. 18,999, రూ. 20,999 కి చేరుకోవచ్చని సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ప్రముఖ బ్రాండ్లుగా ఉండటంతో.. ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారిపై మరింత భారం పడనుందని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *