Smart Glasses: కళ్లజోడుతోనే ఫోన్, మ్యూజిక్, ఫొటోస్.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ గ్లాసెస్!

Smart Glasses: కళ్లజోడుతోనే ఫోన్, మ్యూజిక్, ఫొటోస్..  మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ గ్లాసెస్!


స్మార్ట్ గ్లాసెస్ అంటే.. టెక్నాలజీతో లోడ్ చేయబడిన కళ్లద్దాలు అని అర్థం. ఇవి కేవలం స్టైల్ గా మాత్రమే కాదు కాల్స్, మ్యూజిక్, ఫొటోస్.. ఇలా వీటిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. మరి మీరు కూడా ఇలాంటి గ్లాసెస్ కొనాలనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడూ చూసేద్దాం.

రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్

మెటా, రేబాన్‌ సంస్థలు కలిసి ఓ సరికొత్త స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. ‘రేబాన్‌ స్టోరీస్‌’ పేరుతో రిలీజైన ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ నిజంగా ఎంతో స్మార్ట్ గా పని చేస్తాయి. ఈ కళ్లద్దాలలో  ఫ్రేమ్‌కి రెండువైపులా 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. వీటితో సుమారు 500 ఫొటోలు, 30 సెకన్ల నిడివి ఉన్న 35 వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాకు ఇరుపక్కల ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. వీటితో పాటు ఫ్రేమ్‌కి రెండు వైపులా స్పీకర్స్‌ ఉంటాయి. వీటి ద్వారా తక్కువ సౌండ్ తో మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. అలాగే ఈ స్పీకర్స్ ద్వారా ఫోన్‌ కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. దానికోసం ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో మూడు మైక్రోఫోన్స్ కూడా అమర్చారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ను  బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌ కు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్ వ్యూ యాప్‌ ద్వారా యూజర్లు స్మార్ట్‌గ్లాసెస్‌తో తీసిన ఫొటోలు, వీడియోలను చూడొచ్చు.

ఈ స్మార్ట్ గ్లాసెస్ ను  టైప్ -సీ ఛార్జింగ్‌ కేబుల్‌తో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ గ్లాసెస్ లో ఆరు రకాల లెన్స్‌ వేరియంట్లు ఉన్నాయి. రెగ్యులర్‌, పోలరైజ్‌డ్‌, ట్రాన్సిషన్ లెన్స్‌ తో ఈ గ్లాసెస్ రూపొందించారు. ఈ గ్లాసెస్  ధర  రూ. 29,000 ఉంటుంది.

ఓక్లే మెటా స్మార్ట్ గ్లాసెస్

వీటిని మెటా, ఓక్లే సంస్థలు కలిపి రూపొందించాయి. ఇవి స్పోర్ట్స్ గ్లాసెస్ కేటగిరీకి చెందినవి.  వీటిని ప్రత్యేకంగా అథ్లెట్ల కోసం రూపొందించారు.  ఈ గ్లాసెస్‌లో 3కే వీడియో రికార్డింగ్ చేయగల 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఐదు మైక్రోఫోన్స్, ఐపీ67 రేటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ గ్లాసెస్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 9 గంటల పాటు పనిచేస్తాయి. కేవలం 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ గ్లాసెస్ ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను నేరుగా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇతర స్మార్ట్ వాచీలు, ఫిట్ నెస్ వాచీలతో కూడా కనెక్ట్ అవతుంది.  దీని ధర సుమారు రూ. 45,000 ఉంటుంది.

 నాయిస్ ఐ1 స్మార్ట్

నాయిస్ ఐ1 స్మార్ట్ .. బడ్జెట్ లో దొరికే బెస్ట్ స్మార్ట్ గ్లాసెస్. ఇందులో 16.2 ఎంఎం ఆడియో డ్రైవర్ ఉంటుంది.  బ్లూటూత్ ద్వారా పాటలు వినొచ్చు.  రెండు వైపులా మైక్రోఫోన్స్ ఉంటాయి.  ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ కమాండ్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ధర రూ. 2000 ఉంటుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *