Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!


Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

నేటి ఉరుకులు, పరుగుల వేగవంతమైన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువేం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు సరైన వ్యాయామం కూడా చాలా అవసరం. అయితే, అందరికీ జిమ్‌కు వెళ్లడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన, చవకైన, ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం ఒకటుంది. అవును, ఇంట్లోనే ఉండి ఈజీగా ఈ ఎక్సర్‌సైజ్‌ చేసుకోవచ్చు. దీంతో రెట్టింపు ప్రయోజనం పొందుతారు. అది మరెంటో కాదు.. తాడుతో ఆడటం.. అదే స్కిప్పింగ్.. అందరికీ తెలిసిన స్కిప్పింగ్‌ బెనిఫిట్స్ అనేకం ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అవును, స్కిప్పింగ్‌ రోజుకు కేవలం 15 నిమిషాల పాటు స్పిప్పింగ్‌ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శారీరక ఆరోగ్యానికే కాకుండా మీ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది మీరు ఇంట్లో లేదా ఎక్కడైనా తక్కువ సమయంలో చేయగలిగే పూర్తి శరీర వ్యాయామం. రోజుకు కేవలం 15 నిమిషాలు ఇలా స్కిప్పింగ్‌ చేయటం వల్ల ఫిట్‌నెస్ మెరుగుపడటమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులను కూడా నివారించవచ్చు. ఈ వ్యాయామం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది – స్కిప్పింగ్‌ వల్ల అధిక మొత్తంలో కేలరీలు బర్న్ అవుతాయి. దాదాపు 15 నిమిషాలు ఈ వ్యాయామం చేయటం వల్ల 200 నుండి 300 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది వేగంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది – ఇది గుండెను బలోపేతం చేసే, రక్త ప్రసరణను మెరుగుపరిచే అద్భుతమైన కార్డియో వ్యాయామం. గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకలను బలపరుస్తుంది – క్రమం తప్పకుండా స్కిప్పింగ్‌ చేయటం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కండరాలను టోన్ చేస్తుంది – ఈ వ్యాయామం కాళ్ళు, తొడలు, కడుపు, భుజాల కండరాలను చురుగ్గా ఉంచుతుంది. వాటిని బలంగా చేస్తుంది.

శక్తి, ఓర్పు పెరుగుదల – ఈ వ్యాయామం ఓర్పును పెంచుతుంది. ఇది రోజంతా శక్తిని నిలబెట్టడంలో సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది.

సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది – స్కిప్పింగ్‌ వల్ల శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది దృష్టి, సమన్వయానికి కూడా సహాయపడుతుంది.

ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం – ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది హ్యాపీ హార్మోన్ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది – ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *