హిందూ మతంలో స్కంద షష్ఠి పండుగను కార్తికేయుడికి (స్కందుడికి) అంకితం చేస్తారు. ఈ ప్రత్యేక తిథిని ప్రతి నెల శుక్ల పక్షంలో ఆరవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు శివపార్వతి దేవి కుమారుడు కార్తికేయుడిని ఆరాధించడానికి మాత్రమే కాదు ఎవరి జాతకంలోనైనా మంగళ దోషంతో బాధపడేవారికి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కుజ గ్రహం ప్రతికూల ప్రభావాలను, దాని వల్ల కలిగే బాధలను తొలగించడానికి స్కంద షష్ఠి ఒక వరం లాంటిది.
స్కంద షష్ఠి శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షషష్ఠి తిథి సెప్టెంబర్ 27, 2025 శనివారం మధ్యాహ్నం 12:03 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి ఉపవాసం, పూజలు సెప్టెంబర్ 27వ తేదీ 2025 శనివారం రోజు నిర్వహిస్తారు. ఈ శుభ తిథిలో చేసే పరిహారాలు త్వరిత ఫలితాలను ఇస్తాయి.
స్కంద షష్ఠి, మంగళ దోషం మధ్య సంబంధం ఎందుకు ప్రత్యేకమైనది?
పురాణ నమ్మకాల ప్రకారం కార్తికేయుడిని దేవతల సైన్యాధిపతి అని పిలుస్తారు. అంగారక గ్రహానికి అధిపతి సుబ్రమణ్య స్వామి. దీని అర్థం అంగారక గ్రహం స్కందుడికి నేరుగా సంబంధించినది. ఎవరి జాతకంలోనైనా మంగళ దోషం ఉంటే వివాహంలో అడ్డంకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అప్పులు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల సరైన ఆచారాలతో, సంబంధిత నివారణలతో కార్తికేయుడిని పూజించడం వల్ల అంగారక దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలోని బాధలు తొలగితాయని విశ్వాసం.
ఇవి కూడా చదవండి
మంగళ దోషాన్ని తగ్గించుకోవడానికి స్కంద షష్ఠి రోజున చేయాల్సిన పరిహారాలు
కార్తికేయునికి ప్రత్యేక పూజ విధానం: స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, కార్తికేయ విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించి ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా గులాబీలను సమర్పించండి.
పూజావిధానం : పూజ సమయంలో కర్పూరం, సింధూరం, పసుపు, కుంకుమని సమర్పించండి.
నైవేద్యాలు : ఖీర్ లేదా స్వీట్లను వంటి ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి.. తరువాత దానిని ప్రసాదంగా పంచండి.
‘స్కంద షష్ఠి స్తోత్రం’ పారాయణం
ప్రాముఖ్యత: ఈ రోజున స్కంద షష్ఠి స్తోత్రాన్ని పఠించడం వల్ల కుజ గ్రహం దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని పూర్తి భక్తితో పఠించడం వల్ల కుజ గ్రహం వల్ల కలిగే అన్ని బాధలు తొలగిపోతాయి.
మంత్ర జపము: అలాగే కార్తికేయ భగవానుని ‘ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్’ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం
దానధర్మాలు: కుజ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. కనుక ఈ రోజున పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఎర్ర పప్పు, బెల్లం, రాగి, ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. ఇది కుజ గ్రహాన్ని శాంతింపజేస్తుంది. దుష్ప్రభావాల ప్రభావాలను తగ్గిస్తుంది.
నీటిలో బెల్లం కలిపి అభిషేకం చేయండి.
అభిషేకం: వీలైతే బెల్లం కలిపిన నీటితో కార్తికేయ స్వామికి అభిషేకం చేయండి. మంగళ దోషం వల్ల తలెత్తే ఆస్తి వివాదాలు, రుణ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ పరిహారం సహాయకరంగా పరిగణించబడుతుంది.
స్కంద షష్ఠి రోజున తీసుకునే ఈ చర్యలన్నీ మంగళ దోషం వల్ల కలిగే అన్ని అడ్డంకులను.. ముఖ్యంగా వివాహం, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడతాయని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు